నేడు సహస్ర కలశాభిషేకం

ABN , First Publish Date - 2021-02-27T05:00:29+05:30 IST

నేడు సహస్ర కలశాభిషేకం

నేడు సహస్ర కలశాభిషేకం

భక్తిప్రపత్తులతో సహస్ర కలశావాహన 

భద్రాచలం, ఫిబ్రవరి 26: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మాఘమాసంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం సహస్ర కలశాభిషేకం నిర్వహించను న్నారు. స్థానిక యాగశాలలో గురువారం రాత్రి అర్చకులు అంకురార్పణ నిర్వ హించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. శుక్రవారం సహస్ర కలశవాహన నిర్వహించారు. శనివారం సహస్ర కలశాభి షేకం నిర్వహించనున్నారు. సహస్త కలాశాభిషేకాన్ని పురస్కరించుకుని నిత్య కల్యాణం, పవళింపు సేవలు రెండు రోజులపాటు నిలిపివేశారు. కార్యక్రమంలో స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామచంద్రా చార్యులు, ఉప ప్రధాన అర్చకుడు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అర్చకుడు పొడిచేటి రామభద్రాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:00:29+05:30 IST