భద్రాద్రి నవమి ఉత్సవాల నిర్వహణపై మళ్లీ సందిగ్ధత

ABN , First Publish Date - 2021-03-21T06:40:27+05:30 IST

భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం ఈసారి కూడా ఆలయ వేద పండితులతో పాటు ముఖ్యుల ఆధ్వర్యంలోనే జరిగే అవకాశం ఉందని శుక్రవారం రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రకటించడంతో భద్రాద్రి నవమి ఉత్సవాల నిర్వహణపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది.

భద్రాద్రి నవమి ఉత్సవాల నిర్వహణపై మళ్లీ సందిగ్ధత
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం (ఫైల్‌)

 ఆరుబయటా.. అంతరంగికంగానేనా..?

 ఏటూ తేలని భద్రాద్రి నవమి కల్యాణ వేదిక

 సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపు

 మంత్రి అజయ్‌ ప్రకటనతో నిరాశలో భక్తులు

భద్రాచలం, మార్చి 20: భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం ఈసారి కూడా ఆలయ వేద పండితులతో పాటు ముఖ్యుల ఆధ్వర్యంలోనే జరిగే అవకాశం ఉందని శుక్రవారం రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రకటించడంతో భద్రాద్రి నవమి ఉత్సవాల నిర్వహణపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలతో కల్యాణం నిర్వహించాలని ప్రభుత్వం భావి స్తోందని, దీనిపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొ నడంతో వేద పండితులు, అర్చకులు, ముఖ్యుల సమక్షంలోనే రామయ్య కల్యాణం జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమవు తున్నాయి. అయితే దీనిపై తుదినిర్ణయం సీఎం కేసీఆర్‌ తీసుకునే అవకాశం ఉందని మంత్రి వెల్లడించడంతో రామయ్య కల్యాణ వేదిక కోసం మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే భద్రాద్రి దేవస్థానం అధికారులు మాత్రం ఈ విషయంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో అసలు భద్రాద్రిలో నవమి ఉత్సవాల వేదిక ఎక్కడనేదానిపై సందిగ్దత నెలకొంది.  

గతేడాది నిత్యకల్యాణ మండపంలోనే..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది రామయ్య కల్యాణం రామాలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్దనే నిర్వహించారు. నవమి ఉత్స వాలు మిథిలా స్టేడియంలో నిర్వహించకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనవ్వడంతో పాటు దేవస్థానం కూడా సుమారు రూ.రెండు కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఈ ప్లవనామ సంవత్సరంలో మాత్రం ఆరుబయటే కల్యాణం నిర్వహించేందుకు తొలినుంచి భద్రాద్రి దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తుండగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కానీ కొవిడ్‌ మార్గదర్శకాల కనుగుణంగానే భద్రాద్రి నవమి ఉత్సవాలు నిర్వహించాలని  దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. అయితే ఈ విషయంలో మరింత స్పష్టత కోసం వేచి చూస్తున్న తరుణం లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రకటనతో మరోసారి రామయ్య కల్యాణ ఉత్సవం నిత్యకల్యాణ మండపానికే పరిమితం చేస్తారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. 


Updated Date - 2021-03-21T06:40:27+05:30 IST