అమ్మిన పత్తి పంటకు డబ్బులు ఇవ్వలేదని రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-12-23T19:27:29+05:30 IST
అమ్మిన పత్తి పంటకు వ్యాపారి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అమ్మిన పత్తి పంటకు వ్యాపారి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో జరిగింది. ఈ ఘటన తర్వాత ఆ వ్యాపారిపై రైతు బంధువులు దాడి చేశారు. సుజాతనగర్ తండాకు చెందిన దేవ్ అనే రైతు పత్తి కొనుగోలు చేసిన వ్యాపారి షాపు మందే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్ని రోజులు తిరిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో అతని బంధువులు వ్యాపారిని చితకబాదారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.