కమిషనర్‌పై బినామీ కాంట్రాక్టర్‌ వీరంగం!

ABN , First Publish Date - 2021-07-24T05:37:27+05:30 IST

మొక్కలు నాటే విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ మందలించినందుకు ఇక బినామీ కాంట్రాక్టర్‌ కమిషనర్‌పై గొడవకు దిగిన సంఘటన శుక్రవారం కార్యాలయంలో సంచలనం కలిగించింది.

కమిషనర్‌పై బినామీ కాంట్రాక్టర్‌  వీరంగం!

ఖమ్మం కార్పొరేషన్‌, జూలై 23: మొక్కలు నాటే విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ మందలించినందుకు ఇక బినామీ కాంట్రాక్టర్‌ కమిషనర్‌పై గొడవకు దిగిన సంఘటన శుక్రవారం కార్యాలయంలో సంచలనం కలిగించింది. మెప్మా పరిధిలోని టౌన్‌లెవల్‌ ఫెడరేషన్‌ (టీఎల్‌ఎఫ్‌) ఒక కాంట్రాక్టర్‌కు మొక్కలు నాటేందుకు రూ.5లక్షల కాంట్రాక్ట్‌ ఇచ్చింది. సదరు కాంట్రాక్టర్‌ వేరేవారి లైసెన్స్‌తో పనులు చేస్తున్నాడు. అయితే శుక్రవారం ఆ ప్రాంతానికి వెళ్లిన కమిషనర్‌ మొక్కలు నాటకపోవటంపై డీఈ, ఏఈలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారితో పాటు కాంట్రాక్టర్‌పై సీరియస్‌ అయ్యారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ శుక్రవారం సాయంత్రం ఏకంగా కమిషనర్‌ ఛాంబర్‌కు వెళ్లి వీరంగం వేసినట్లు సమాచారం. దీనిపై కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-07-24T05:37:27+05:30 IST