నిమజ్జన వేడుక శాంతియుతంగా నిర్వహించాలి: భద్రాద్రి కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-09-18T06:01:54+05:30 IST

భద్రాద్రి జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమాలు సజావుగా, శాంతియుతంగా జరిగే ప్రజలు జిల్లా యంత్రాగానికి సహకరించాలని కలెక్టర్‌ అనుదీప్‌ శుక్రవారం ఓ ప్రకనటలో కోరారు.

నిమజ్జన వేడుక శాంతియుతంగా నిర్వహించాలి: భద్రాద్రి కలెక్టర్‌

భద్రగిరి గోదావరి తీరంలో పకడ్బందీ ఏర్పాట్లు 

కొత్తగూడెం కలెక్టరేట్‌ / భద్రాచలం, సెప్టెంబరు 17: భద్రాద్రి జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమాలు సజావుగా, శాంతియుతంగా జరిగే ప్రజలు జిల్లా యంత్రాగానికి సహకరించాలని కలెక్టర్‌ అనుదీప్‌ శుక్రవారం ఓ ప్రకనటలో కోరారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఆయన ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహానికి ఇద్దరు భక్తులను మాత్రమే నిమజ్జనం వద్దకు అనుమతిస్తున్నామన్నారు. భద్రాచలం వద్ద భక్తులు గోదావరి వంతెనపైనుంచి విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని, తప్పని సరిగా జిల్లా యంత్రాంగం సూచించిన చోట మాత్రమే నిమజ్జనం చేయాలన్నారు. గోదావరి తీరంలో నాటు పడవలు, గజ ఈతగాళ్లను మోహరించామని, విద్యుత్‌, తాగునీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు ఉమ్మడిజిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో గణనాథులను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో గోదావరి నదీ తీరంలో రెండు లాంచీలు, రెండు క్రేన్లు ఏర్పాటు చేయగా శనివారం అదనంగా మరో నాలుగు క్రేన్లను రప్పించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-09-18T06:01:54+05:30 IST