ఉద్యోగులకు మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు

ABN , First Publish Date - 2021-06-23T04:49:58+05:30 IST

ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చేలా వారికి అదనపు ప్రయోజనాలు అందేలా చూసేందుకు సింగరేణి యాజమాన్యం కృషిచేస్తోంది.

ఉద్యోగులకు మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు
వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమైన సింగరేణి డైరెక్టర్లు

బ్యాంకర్లతో సింగరేణి అధికారుల చర్చలు

ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం : 

ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చేలా వారికి అదనపు ప్రయోజనాలు అందేలా చూసేందుకు సింగరేణి యాజమాన్యం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ పా) ఎన్‌. బలరాం సారథ్యంలో జనరల్‌ మేనేజర్‌ (పర్సన ల్‌) ఎ. ఆనందరావు, జీఎం (ఫైనాన్స్‌) సుబ్బారావు బృందం ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐ, ప్రైవేట్‌ రంగంలో ప్రముఖమైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉండటం ద్వారా అందజేస్తున్న అదనపు ప్రయోజనాల వివరాలను డైరెక్టర్‌ (పా అండ్‌ ఫైనాన్‌ ్స) ఎన్‌. బలరాం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ ఏజీఎం (ఫైనాన్స్‌) రాజేశ్వరరావు, పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌. వెంకటేశ్వరరావు, ఎకౌంట్స్‌ అధికారి బోడ భద్రు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకుల నుంచి ప్రతినిధులు సురేష్‌ కుమార్‌, సంజీవ్‌ సాహు, శ్రీకాంత్‌ సాహు, బైద్య మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:49:58+05:30 IST