భద్రాద్రిలో బాలభీముడు

ABN , First Publish Date - 2021-11-10T04:58:22+05:30 IST

సహజంగా శిశువులు జనన సమయంలో మూడు నుంచి నాలుగు కిలోల లోపు బరువు ఉంటారు.

భద్రాద్రిలో బాలభీముడు
శస్త్రచికిత్స చేసిన వైద్యులు

ఐదుకిలోల బరువుతో జన్మించిన మగశిశువు

భద్రాచలం, నవంబరు 9: సహజంగా శిశువులు జనన సమయంలో మూడు నుంచి నాలుగు కిలోల లోపు బరువు ఉంటారు. కానీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో మంగళవారం ఐదు కిలోల బరువున్న మగశిశువు జన్మించాడు. ప్రస్తుతం ఆ తల్లీబిడ్ల క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ గ్రామానికి చెందిన కె.శ్రావణి పురిటి నొప్పులతో బాధపడుతూ సోమవారం రాత్రి భద్రాచలం అంబేద్కర్‌ సెంటర్లోని శ్రీ సురక్ష ఆసుపత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన అనంతరం మంగళవారం గైనకాలజిస్టు సూరపనేని శ్రీకాంతి, వైద్యులు డాక్టర్‌ అక్కినేని లోకేష్‌ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో ఐదు కిలోల బరువున్న మగబిడ్డ జన్మించాడు. అయితే శ్రావణి మొదటి కాన్పులోనూ బాబుకు జన్మనివ్వగా ఆ సమయంలో ఆ బాబు కూడా 4.50 కిలోల బరువున్నాడని, ఇప్పుడు రెండో కాన్పులో పుట్టిన బాబు కూడా ఐదు కిలోలు ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యుల తెలిపారు. 


Updated Date - 2021-11-10T04:58:22+05:30 IST