గుట్కాలు దాచారనే నెపంతో చితక్కొట్టారు

ABN , First Publish Date - 2021-12-26T06:07:41+05:30 IST

జోడెద్దుల కొట్లాటలో లేగ దూడలు నలిగి పోయిన చందా నా.. గుట్కా తయారీ, రవాణాకు మూలమైన వారి మధ్యలో అమాయకులు బలవు తున్నారు.

గుట్కాలు దాచారనే నెపంతో చితక్కొట్టారు

బోనకల్‌ పోలీసులపై ఓ యువకుడి ఆరోపణ

బెల్టుతో చితకబాదడంతో చేతులు వాచాయని ఆవేదన

గుట్కాలను తప్పించినందు వల్లే కేసు: ఆంధ్రజ్యోతితో ఎస్సై

బోనకల్‌, డిసెంబరు 25: జోడెద్దుల కొట్లాటలో లేగ దూడలు నలిగి పోయిన చందా నా.. గుట్కా తయారీ, రవాణాకు మూలమైన వారి మధ్యలో అమాయకులు బలవు తున్నారు. ఇందుకు దృష్టాంతంగా బోనకల్‌ మండలం కలకోటలో జరిగిన సంఘ టన నిలిచింది. తనను అన్యాయంగా ఎస్సై చితక్కొట్టారని చేతి పై కందిన దెబ్బను చూపిస్తూ శనివారం ఓ యువకుడు విలేకర్ల ముందు తన ఆవేదనను వ్య క్తం చేశాడు. జరిగిన సంఘటన గురించి ఫొటోలతో పాటు లేఖను విడుదల చేశాడు. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం... గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ బాబు ఖమ్మంలో డిగ్రీ చదువుతున్నాడు. అక్కడే వెబ్‌ డిజైనింగ్‌ కోర్సు నేర్చుకుంటున్నాడు. రోజూ గ్రామానికి వచ్చి పోతుంటాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రోడ్డు పక్కనే చిన్న బల్ల పెట్టుకొని అప్పుడప్పుడు బజ్జీలు వేస్తుంటారు. గ్రామంలో పోలీ సులు గుట్కాల పట్టివేత కోసం తనిఖీలు నిర్వహించే క్రమంలో హుస్సేన్‌ సోదరి మాస్కు లేక పోవడంతో జరిమానా విధిస్తారన్న భయంతో ఇంటి వైపునకు పరుగు తీసింది. అదే సమయంలో హుస్సేన్‌ ఖమ్మం నుంచి వస్తుండగా పోలీసులు అతడి ఇంటికి వచ్చారు. మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తుతున్నారని పోలీసులు ప్రశ్నిం చారు. మాములుగానే ఇంటికి వచ్చామని వారు సమాధానం ఇచ్చారు. ఇంట్లో సోదా లు చేయగా ఏమీ దొరకకపోవడంతో అనుమానంతో ఎక్కడ దాచారో చెప్పాలని హుస్సేన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ విచారణలో తాను డిగ్రీ చదువు తున్నానని గుట్కాల గురించి ఏమీ తెలియదని, కనీసం తనకు తినే అలవాటు కూడా లేదని చెప్పాడు. దీంతో నిజం చెప్పాలని ఎస్సై బెల్టుతో రెండు చేతులు పై చితక బాదినట్లు వాపోయాడు. దెబ్బల వల్ల నొప్పులు ఉండటంతో మధిర ప్రభు త్వాసుపత్రికి వెళ్లి మందులు రాయించుకొని వచ్చినట్లు తెలిపాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని, జరిగిన సంఘటన పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గుట్కా తయారీతో పాటు రవాణాకు అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోకుండా గ్రామంలో అమాయకుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి జై భీమ్‌ తరహాలో నేరం ఒప్పించేలా పోలీసులు కొట్టడం, అతడి పై కేసు నమోదు చేయడం దారుణమని బాధితుడి కుటంబ సభ్యులు, బంధువులు, గ్రా మస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఎస్సై తేజావత్‌ కవితను వివరణ కోరగా తాను హుస్సేన్‌ను కొ ట్టలేదని సమాధానమిచ్చారు. గుట్కాలను తప్పించినందు వల్లే కేసు నమోదు చేశా మని, తన పై వచ్చిన ఆరోపణలలో నిజం లేదన్నారు. 

Updated Date - 2021-12-26T06:07:41+05:30 IST