స్నేహితుల మధ్య వివాదం రేపిన రూ.500

ABN , First Publish Date - 2021-12-31T05:20:59+05:30 IST

రూ.500 అప్పు స్నేహితుల మధ్య వివాదానికి కారణమైంది. తన వద్ద అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన ఖమ్మం నగరంలోని బీకే బజార్‌లో గురువారం జరిగింది.

స్నేహితుల మధ్య వివాదం రేపిన రూ.500
ప్రభుత్వాసుపత్రిలో నాగరాజు

అప్పు తీర్చమన్నందుకు కత్తితో దాడి

ఖమ్మంలో ఘటన 

ఖమ్మం క్రైం డిసెంబరు 30: రూ.500 అప్పు స్నేహితుల మధ్య వివాదానికి కారణమైంది. తన వద్ద అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన ఖమ్మం నగరంలోని బీకే బజార్‌లో గురువారం జరిగింది. నగరంలోని బీకే బజార్‌కు చెందిన ఉల్లోజు నాగరాజు అనే వ్యక్తి కాల్వఒడ్డుకు చెందిన ముత్తబోయిన భాస్కర్‌కు గతంలో రూ.500 అప్పుగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం బీకే బజార్‌లోని ఓ మటన్‌ దుకాణం వద్ద ఉన్న భాస్కర్‌ను కలిసిన నాగరాజు.. తన వద్ద తీసుకున్న రూ.500 తిరిగి ఇవ్వమని అడగ్గా డబ్బులు లేవని భాస్కర్‌ సమాధానం చెప్పాడు. దీంతో జేబులో డబ్బులు ఉన్నా లేవని చెబుతావేంటంటూ భాస్కర్‌ నుంచిడబ్బు తీసుకునేందుకు నాగరాజు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భాస్కర్‌ మటన్‌ దుకాణంలో ఉన్న చిన్న కత్తితో నాగరాజుపై దాడిచేశాడు. ఈ దాడిలో బాధితుడి మొహం, తలకు, ఎడమ భుజానికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌ టౌన్‌ సీఐ చిట్టిబాబు సంఘటన స్థలం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-31T05:20:59+05:30 IST