వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద ఆందోళన

ABN , First Publish Date - 2021-09-19T05:31:33+05:30 IST

మండలంలోని జుజ్జులరావుపేట గ్రామంలో వాక్సినేషన్‌ కేంద్రం వద్ద గ్రామస్ధులు ఆందోళన చేశారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద  ఆందోళన

కూసుమంచి, సెప్టెంబరు 18: మండలంలోని జుజ్జులరావుపేట గ్రామంలో వాక్సినేషన్‌ కేంద్రం వద్ద గ్రామస్ధులు ఆందోళన చేశారు. ప్రభుత్వం ఇటీవల19 తేదీ వరకు మూడురోజులపాటు 18సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి   మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మండలానికి వచ్చిన డోసులను ప్రతిగ్రామానికి 50వరకు పంపిణీ చేశారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ వాక్సిన్‌ వేయించుకోవాలని సర్పంచులు చాటింపు వేయించారు.   కేంద్రాలకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో వాక్సిన్‌లు సరిపోలేదు. వ్యవసాయ పనులు, కూలీపనులు వదిలి వచ్చామని ఇప్పుడు వ్యాక్సిన్‌ లేదంటే ఎలా అంటూ ఆందోళన నిర్వహించారు.  సోమవారం తెప్పించి వేయిస్తామని   ఏఎన్‌ఎంలను, సర్పంచులు హామీ ఇవ్వడంతో శాంతించారు. 

Updated Date - 2021-09-19T05:31:33+05:30 IST