విధి నిర్వహణలో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-08-20T05:31:11+05:30 IST

విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని భట్టుపల్లి, సమత్‌ భట్టుపల్లి, కరకగూడెంలో విస్తృతంగా పర్యటించారు.

విధి నిర్వహణలో అలసత్వం వద్దు
తొట్టిలో నిల్వ ఉన్న నీటిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌

అధికారులకు కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశం

ఫ్రైడేడ్రైడే సమర్థవంతంగా నిర్వహించాలని సర్పంచ్‌లకు సూచన

కరకగూడెంలో విస్తృత పర్యటన 

తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీలు 

రెవెన్యూ సిబ్బంది గైర్హాజరుపై అసంతృప్తి

కరకగూడెం, ఆగస్టు 19: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని భట్టుపల్లి, సమత్‌ భట్టుపల్లి, కరకగూడెంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగం గా సమత్‌ భట్టుపల్లి నూతనంగా నిర్మించనున్న బృహత్‌ పల్లెప్రకృతి వనానికి కేటాయించిన భూమిని పరిశిలించి, పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతతరం తొట్లల్లో నిల్వ నీటిని తొలగించాలని అధికారులను ఆదేశిం చారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఫ్రైడేడ్రైడేను సమర్థవంతంగా నిర్వహించాలని సర్పంచ్‌లకు సూచించారు. అనంతరం కరకగూడెం తాహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న కటెక్టర్‌ అధికారుల గుదులను పరిశిలించారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ బాబు, జూనియర్‌ అసిస్టెంట్‌, వీఆర్‌వోలు లేక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రికార్డులను, హాజరు పట్టికలను తనిఖీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, సర్పంచ్‌లు తోలెం నాగేశ్వరావు, ఉప సర్పంచ్‌ రావుల రవి, సూపరింటెండెంట్‌ శ్రీను, ఆర్‌ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌, ప్రత్యేక అధికారి సంజయ్‌సింగ్‌, రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బుడగం రాము, పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T05:31:11+05:30 IST