అందరి కృషితోనే వైద్యసేవల్లో జిల్లా అగ్రస్థానం
ABN , First Publish Date - 2021-03-21T05:39:38+05:30 IST
పూర్తిస్థాయి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మాలతికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిదిలోని అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతికి అభినందనల వెల్లువ
ఖమ్మంసంక్షేమవిభాగం,మార్చి 20: పూర్తిస్థాయి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మాలతికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిదిలోని అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో టీఎన్‌జీవోస్ మెడికల్ పోరమ్ అధ్యక్ష, కార్యదర్శలు తాళ్లూరి శ్రీకాంత్, అనిల్, ప్రోగ్రమ్ అఫీసర్లు, కార్యాలయం అధికారుల అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మాలతిని ఘనంగా సన్మానించారు. వైద్యఆరోగ్యశాఖ ప్రోగ్రమ్ అఫీసర్లు డాక్టర్ కొటిరత్నం, డాక్టర్ అలివేలు, డాక్టర్ సైదులు, డాక్టర్ రామారావు, ఎన్‌హెచ్‌ఎం ప్రాంతీయ అధికారిణి నీలోహాన, కార్యాలయం పర్యవేక్షకులు రఘుకుమార్, డిప్యూటీ డెమో వై సాంబశివారెడ్డి, హరికృష్ణ, రమణ తదితరులు ఘనంగా సన్మానించారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి మాట్లాడుతూ అందరి సహాకారంతోనే వైద్యసేవల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందన్నారు.