అంబులెన్స్‌ యజమానుల దందాను నిరోధించాలి

ABN , First Publish Date - 2021-08-22T04:55:21+05:30 IST

చావుబతుకుల మధ్య ఉన్న రోగుల వద్ద ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రిల యాజమాన్యాల దందాపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకులు వై విక్రమ్‌ డిమాండ్‌ చేశారు.

అంబులెన్స్‌ యజమానుల దందాను నిరోధించాలి

 డీఎంహెచ్‌వోకు సీపీఎం నేతల వినతి

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు21: చావుబతుకుల మధ్య ఉన్న రోగుల వద్ద ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రిల యాజమాన్యాల దందాపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకులు వై విక్రమ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం నాయకులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్‌ మాలతికి వినతి పత్రాన్ని అందచేశారు. ఈసందర్భంగా విక్రమ్‌ మాట్లాడుతూ నగరంలోని వైరారోడ్డు, హాస్పటల్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు పేషెంట్లను తీసుకెళ్లడానికి నాలుగు వేలు తీసుకొంటున్నారని ఆరోపించారు. రోగులు అనారోగ్యంతో బాధపడుతుంటే వేలాది రూపాయలను ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హస్పటళ్లలో అంబులెన్స్‌ రాకుండా నిలువుదోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్పందించి చెక్‌ పెట్టాలని వారు డీఎంహెచ్‌వోను కోరారు. ఈ కార్యక్రమంలో నర్రారమేష్‌, బి సుదర్శన్‌, జె వెంకన్నబాబు, కె వెంకన్న తదితరులున్నారు.  

Updated Date - 2021-08-22T04:55:21+05:30 IST