ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2021-12-20T05:29:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ఇంటర్‌ విద్యార్థులకు శాపంగా మారిందని ఎఐ ఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ చాం ద్‌పాషా బోడ అభిమిత్ర ఆరోపించారు.

ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మాట్లాడుతున్న చాంద్‌ పాషా

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి చాంద్‌పాషా

జూలూరుపాడు, డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ఇంటర్‌ విద్యార్థులకు శాపంగా మారిందని ఎఐ ఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ చాం ద్‌పాషా బోడ అభిమిత్ర ఆరోపించారు. ఆదివారం సీపీఎం కా ర్యాలయంలో ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల ముఖ్య కార్య కర్తల సమావేశంలో వారు మాట్లాడారు.  ప్రత్యక్ష తరగతులను నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించి పరీక్షలు పెట్టి విద్యార్థులను ఫెయిల్‌ చేయడం తగదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కొక్క కుటుం బానికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాం డ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేసి కార్యదర్శిని తొలగిం చాలని కోరారు. ఇంటర్‌బోర్డు విధానాన్ని నిరసిస్తూ సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు జి. పవన్‌కుమార్‌, యశ్వంత్‌, కళ్యాణ్‌, వంశీ, నవీన్‌ త దితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-20T05:29:27+05:30 IST