సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: టౌన్‌ ఏసీపీ

ABN , First Publish Date - 2021-12-20T04:45:46+05:30 IST

సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని టౌన్‌ ఏసీపీ ఆంజనేయులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: టౌన్‌ ఏసీపీ

ఖమ్మం క్రైం,డిసెంబరు19: సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని టౌన్‌ ఏసీపీ ఆంజనేయులు ఓ ప్రకటనలో హెచ్చరించారు. గత రాత్రి చర్చి కాంపౌండ్‌ సెంటర్‌లో జరిగిన సంఘటనను వక్రీకరిస్తూ మతపరమైన దుష్ప్రచారానికి తెరలెపుతూ సామాజిక విద్వేషాలు పెంచే రీతిలో పోస్టు పెడుతున్నారు.్న వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. తమ ఉనికికోసం ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా, కించపరిచేలా, సోషల్‌ మిడియాలో ఇష్టానుసారంగా ఎవ్వరైనా పోస్టులు ఫోటోలు పెడితే, షేర్‌ చేయడం సమజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.   దుష్ప్రచారాన్ని ప్రోత్సహించే వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-12-20T04:45:46+05:30 IST