ఆదిలక్ష్మిగా అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-07T06:10:45+05:30 IST

ఆదిలక్ష్మిగా అమ్మవారు

ఆదిలక్ష్మిగా అమ్మవారు
ఆదిలక్ష్మీ అలంకారంలో అమ్మవారు

భద్రాద్రిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు  

లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం

నేడు  సంతానలక్ష్మిగా దర్శనం

భద్రాచలం, అక్టోబరు 6: భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు ఆలయంలో దేవి శరన్న వరాత్రి మహోత్సవాలు బుధవారం సంప్ర దాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత మూల వరులకు పంచామృతాలతో ప్రత్యేకస్నపనం నిర్వహించారు.అనంతరం అమ్మవారిని ఆది లక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజాకార్య క్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన, బాలకాండ పారాయణం నిర్వహించారు. దేవస్థానం ఏఈవో వి.శ్రవణ్‌కుమార్‌ అమ్మవారిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు కేఈ.స్థలశాయి, ప్రధానఅర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయ రాఘవన్‌ తదితర వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారి నిత్యకల్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మ వారు గురువారం సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

భక్తిప్రపత్తులతో రామాయణ పారాయణం

దేవస్థానం ఆవరణలోని చిత్రకూట మండపంలో బుధవారం శ్రీరామా యణ పారాయణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొ నేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేద పండితులు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు పారాయణం నిర్వహించారు. వేదపండితులు ప్రతి రోజు సాయంత్రం రామాయణ ప్రవచనాలు చేయనున్నారు. 

Updated Date - 2021-10-07T06:10:45+05:30 IST