అడ్డగూడూరు పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T05:13:16+05:30 IST

ఓకేసు విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు అదుపులో తీసుకోగా.. పోలీసుస్టేషన్‌లో మృతి చెందిన చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన అంబడిపుడి మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం

అడ్డగూడూరు పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలి

 నోట్‌ ఫోటోలు టౌన్‌ఫోల్డర్‌లో ఉన్నాయి

22ఆర్‌ఏజీ1  అడ్డగూడూరు పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాఽధితుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

22ఆర్‌ఏజీ3 ఉదయ్‌కిరణ్‌ను పరామర్శిస్తున్న సీపీఎం రాష్ట్ర నాయకులు పొన్నం 

మరియమ్మ కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలి 

ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం నాయకుల డిమాండ్‌ 

బాధితురాలి కుమారుడికి వేర్వేరుగా పరామర్శ

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 22: ఓకేసు విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు అదుపులో తీసుకోగా.. పోలీసుస్టేషన్‌లో మృతి చెందిన చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన అంబడిపుడి మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల పరిహారాన్ని అందించాలని, ఆమె మృతికి కారణమైన పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్‌  చేశారు.  పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను మంగళవారం వారువేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విచారణ పేరుతో మరియమ్మ, ఆమె కుమారుడిని హింసించడమే కాకుండా మరియమ్మ మృతికి కారణమైన అడ్డగూడూరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉదయ్‌కిరణ్‌ను కొట్టిన తీరును చూస్తుంటే వారిని పోలీసులు ఎలా హింసించారో అర్థమవుతోందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని, సంఘటనపై ఎస్సీ,ఎస్టీ, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కూనంనేని వెంట రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌, ఎస్కే సాబీర్‌పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్కే జానీమియా, యర్రాబాబు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, కొండపర్తి గోవిందరావు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు మేకల శ్రీనివాసరావు, ఇంటికాల రామకృష్ణ, చింతకాని మండల నాయకులు పావులూరి మల్లికార్జున్‌రావు, సీతారామిరెడ్డి, సర్పంచ్‌వేమిరెడ్డి తిరుపతమ్మ తదితరులున్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యాదాద్రి జిల్లా పోలీసుల చేతిలో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె మృతికి కారకులైన పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మరియమ్మ మృతి కేసును తప్పుదారి పట్టించి ఆమె మరణానికి కారణమైన, కుమారుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులపై హత్య కేసును నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలు, పెట్టిన చిత్రహింసల వల్లే మరియమ్మ మృతి చెందిందన్నారు. పోలీసులు చేస్తున్న దాష్టీకాలు కట్టడి చేయకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని పొన్నం హెచ్చరించారు. పొన్నం వెంట సీపీఎం చింతకాని మండల కార్యదర్శి మడిపల్లి గోపాల్‌రావు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్‌, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, రాచబంటి రాము, షేక్‌ మౌలా తదితరులున్నారు.

Updated Date - 2021-06-23T05:13:16+05:30 IST