ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 613 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-18T05:36:38+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రమంగా కరోనా తగ్గుముఖమం పడుతోంది. ఇరు జిల్లాల్లో గురువారం 613 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 613 మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌,/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రమంగా కరోనా తగ్గుముఖమం పడుతోంది. ఇరు జిల్లాల్లో గురువారం 613 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8,157మందికి పరీక్షలు నిర్వహించగా 408పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో గురువారం 15 మంది  పాజిటివ్‌తో చేరినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. కొవిడ్‌ వార్డులో మెత్తం 176 మంది వైద్యసేవలు పొందుతున్నారు. 154 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9013మందికి పరీక్షలు నిర్వహించగా 205మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో గురువారం 3,984మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

బ్లాక్‌పంగస్‌తో ప్రైవేట్‌ ఉపాధ్యాయుడి మృతి

 బ్లాక్‌ ఫంగస్‌తో ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన గురువారం రాత్రి మధిర మండలం ఆత్కూరు గ్రామంలో జరిగింది.  మధిరలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో పనిచేస్తున్న బండి ప్రభాకర్‌ (44) కొన్ని రోజుల క్రితం బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి.. చికిత్స తీసుకొని ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ప్రభాకర్‌ అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు మధిరలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. 


Updated Date - 2021-06-18T05:36:38+05:30 IST