గంజాయి బారి నుంచి యువతను కాపాడాలి
ABN , First Publish Date - 2021-10-29T05:58:12+05:30 IST
గ్రామాల్లో గంజాయి సరఫరాను అరికట్టి యువతను దాని బారి నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి అన్నారు.
- పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి
జూలపల్లి, అక్టోబర్ 28 : గ్రామాల్లో గంజాయి సరఫరాను అరికట్టి యువతను దాని బారి నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి అన్నారు. పెద్దపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో గురువారం జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన సర్పం చులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లోని యువకులు గంజాయి చెడు వ్యసనాలకు బానిసై బంగారంలాంటి ఉజ్వల మైన తమ భవిశ్యత్‌ను సర్వనాశనం చేసుకుంటు న్నారన్నారు. అంతేకాకుండా గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులు వారి ఆరోగ్యాలను పాడుచేసుకోవ డమే కాకుండా గంజాయి మత్తులో నేరాలకు పా ల్పడుతూ, అరాచకాలు చేస్తున్నారని ఆయన ఆవే దన వ్యక్తంచేశారు. గంజాయి నియంత్రణకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకుని తగిన విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి ఎస్‌ఐ జానిపాషా, ఆయా గ్రామాల ప్రజాప్రతిని ధులు పాల్గొన్నారు.