యారన్‌ సబ్సిడీ అందించాలి

ABN , First Publish Date - 2021-10-07T06:41:25+05:30 IST

పవర్‌లూం కార్మికులకు పది శాతం యారన్‌ సబ్సిడీ అందించాలని తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

యారన్‌ సబ్సిడీ అందించాలి
పాదయాత్రలో మాట్లాడుతున్న నాయకులు

- వర్కర్‌ టూ ఓనర్‌ పథకంలో షెడ్ల నిర్మాణం పూర్తిచేయాలి

- డిమాండ్ల సాధనకు సీఐటీయూ పాదయాత్ర 

- తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌

 తంగళ్లపల్లి, అక్టోబరు 6: పవర్‌లూం కార్మికులకు పది శాతం యారన్‌ సబ్సిడీ అందించాలని తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పవర్‌లూం కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ల సాధన కోసం తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్‌ పార్కు నుంచి పాద యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. దీంతో డిమాండ్ల సాధన కోసమే పాదయాత్ర చేపట్టామని అన్నారు. ఈ నెల 8వ తేదిన పవర్‌లూం పరిశ్రమలను బంద్‌ చేసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపడుతామని అన్నారు. అలాగే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర చేపట్టిన మూషం రమేష్‌, కోడం రమణ, గుండు రమేష్‌, ఎనగంటి రాజమల్లు, గడ్డం ఎల్లయ్యలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు  మోర అజయ్‌, రావుల రమే్‌షచంద్ర, నక్క దేవదాస్‌, శ్రీపతి మునీందర్‌, తిరుమల్ల సత్యం, నవీన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:41:25+05:30 IST