కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-12-08T06:30:19+05:30 IST

కార్మికలు సమ్మెకు దూరంగా ఉండాలని సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ విజ్ఞప్తి చేశారు.

కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఆర్జీ-2 అధికారులు

ఆర్‌జీ-1, 2 జీఎంలతో డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌

గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 7: కార్మికలు సమ్మెకు దూరంగా ఉండాలని సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల సమ్మె నేపథ్యంలో మంగళవారం డైరెక్టర్లు చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌), బలరాం(పీపీ, పా), సత్యనారాయణరావులు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్‌జీ-1, 2 అధికారులతో చర్చించారు. సమ్మెల సంస్కృతిని మరిచి అభివృద్ధి పథంలో సాగుతున్న సింగరేణిలో మళ్లీ సమ్మెకు పిలుపునివ్వడం దురదృష్టకరమని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, సంస్థ పరిష్కరించే అంశాలు కావని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వసతుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయామని, ప్రతి నిమిషం శ్రమిస్తేనే లక్ష్యాలను చేరుకోగలమని అన్నారు. సమ్మెకు కార్మికులు దూరంగా ఉండి సింగరేణి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉద్యోగులు యఽథావిధిగా విధులకు హాజరు కావాలని కోరారు. గనులు, ఓసీపీల, డిపార్ట్‌మెంట్లు తెరిచే ఉంచాలని, ఉత్పత్తి యఽథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్జీ-2 అధికారును డైరెక్టర్లు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ, ఆర్‌జీ-2 జీఎం వెంకటేశ్వరరావు, ఆర్‌జీ-1 అధికారులు సీహెచ్‌ లక్ష్మీనారాయణ, ఎస్‌ఈఈఎం దాసరి శ్రీనివాస్‌, ఆర్‌జీ-2 ఎస్వోటూ జీఎం సాంబయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T06:30:19+05:30 IST