స్ర్తీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-02-27T05:18:08+05:30 IST
మహిళా సంఘలు స్ర్తీనిధి రుణాలను సక్రమంగా వి నియోగించుకోవాలని కలెక్టర్ జి.రవి అన్నారు.

జిల్లా కలెక్టర్ రవి
మెట్‌పల్లి, ఫిబ్రవరి 26: మహిళా సంఘలు స్ర్తీనిధి రుణాలను సక్రమంగా వి నియోగించుకోవాలని కలెక్టర్ జి.రవి అన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని వాసవి గార్డెన్స్‌లో ఎర్పాటు చేసిన సమావేశంలో స్ధానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. సంఘాలకు మంజూరైన రుణాలు పక్క దారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే విద్యాసా గర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి తోడ్పాటును అం దిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్మన్ సుజాత, పాల్గొన్నారు.
పట్టణాన్ని ముందంజలో ఉంచాలి
వనరులను కాపాడుకోని పట్టణాన్ని ముందంజలో ఉంచాలని కలెక్టర్ జి.రవి అన్నారు. ఆయన శుక్రవారం మున్సిపల్ కార్యలయలంలో కొత్తగా స్వీపింగ్ మిష న్, రెండు మినీ టిప్పర్‌లను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రారంభించా రు. ఆనంతరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చే సిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వార మౌ ళిక సదుపాయాలను సమాకుర్చుకున్నామన్నారు. పట్టణ అభివృద్ధికి 140 లక్షలు వెచ్చించి 5 స్వచ్చ ఆటోలను 2 మిని టిప్పర్‌లను 1 ట్యాంకర్, స్వీపింగ్ మిషన్‌ల ను కోనుగోలు చేశామన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ మంత్రి కేటిఆర్ 50 కోట్లును మంజూర్ చేసారని మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్మన్ రానవేణి సుజాత, కమీషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్‌లు, అధికారులు పాల్గొన్నారు.