వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2021-11-03T05:15:58+05:30 IST

తంగళ్లపల్లి మండల సర్వ సభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. మంగళవారం ఎంపీపీ పడిగెల మానస రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు

తంగళ్లపల్లి, నవంబరు 2: తంగళ్లపల్లి మండల సర్వ సభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. మంగళవారం ఎంపీపీ పడిగెల మానస రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మండల నిధు లతో ఎంపీటీసీలు హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సారంపల్లి సర్పంచ్‌ కొయ్యడ రమేశ్‌ విద్యు త్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయన్నారు. హైమాస్ట్‌ లైట్లకు బదులు నిధులతో రోడ్లు, డ్రైనేజీలు  నిర్మిం చాలని సూచించారు. దీంతో ఎంపీటీసీలు భైరినేని రాము, రాగుల రాజిరెడ్డి తదితరులు కొద్దిపాటి నిధు లతో సీసీ రోడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.   ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. సారంపల్లి సర్పం చ్‌కు  పద్మనగర్‌ సర్పంచ్‌ ముడారి పోచయ్య,  సర్పం చుల ఫోరం మండల అధ్యక్షుడు వలకొండ వేణు గోపాల్‌రావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు మద్దతు తెలిపారు. హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటును వ్యతిరేకించారు. ఇప్పటికే విద్యుత్‌ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో పలు   పంచాయతీలు కొట్టుమిట్టడుతున్నా యని, హైమస్ట్‌ లైట్ల ఏర్పాటు ఎందుకు? అని ప్రశ్నిం చారు. హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటుకు గ్రామ పంచాయతీల తీర్మానం ఇచ్చేది లేదన్నారు. సర్పంచుల అభిప్రాయాన్ని ఎంపీటీసీలు వ్యతి రేకించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సమన్వయంతో సమష్టి నిర్ణయం తీసుకోవాలని, హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయాలని వైస్‌ ఎంపీపీ జంగిటి అంజయ్య సూచించారు. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో క్వింటాకు నాలుగు కిలోల కోత పెడుతు న్నారని,  అధికారులు దృష్టి సారించాలని ఎంపీటీసీ రాజిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. వైస్‌ ఎంపీపీని వేదికపైకి ఆహ్వనించి గౌరవం ఇవ్వాలని ఎంపీటీసీ కోడి అంతయ్య కోరారు. అక్రమ లే అవుట్‌లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మండల సర్వ సభ్య సమావేశం ఏర్పాటుపై ముందుగా తమతో చర్చించడం లేదని జడ్పీటీసీ పుర్మాణి మంజుల అన్నారు. దీంతో ఎంపీపీ జోక్యం  చేసుకొని సమయం, సమావేశం ఏర్పాటు చేసుకునే హాల్‌ అందుబాటులో లేక పోవడం, అద్దె భవనంలో కార్యాలయం కొన సాగడం వంటి కారణాలతో ముందుగా చర్చించ లేక పోతున్నామని వివరించారు. అనంతరం  రైతు బంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, జడ్పీటీసీ పుర్మాణి మంజుల లింగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మన్లు బండి దేవదాస్‌, కొడూరి భాస్కర్‌ గౌడ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లచ్చాలు, ఎంపీటీసీలు సిలివేరి ప్రసూన నర్సయ్య, గుగ్గిళ్ల లావణ్య ఆంజయ్య, ములిగె దుర్గప్రసాద్‌, కర్కబోయిని కుంటయ్య, బుస్స స్వప్న లింగం, మీసాల కళ కృష్ణ, పుర్మాణి కనకలక్ష్మి, సర్పంచ్‌లు జక్కుల రవీందర్‌, సురభి సరిత నవీన్‌రావ్‌, మిట్టపల్లి పద్మ జవహర్‌రెడ్డి, నక్క రేవతి, కుతురు పద్మ, అంకారపు అనిత రవీందర్‌, గనప శివజ్యోతి, బొబ్బల మంజుల మల్లేఽశం, భైరి శ్రీవాణి రమేశ్‌, నకీర్తి బాలమల్లు, దర్పెల్లి స్రవంతి భాస్కర్‌రెడ్డి, పిట్ల నాగరాజ్‌, బాలసాని పర్శరాములు, నందగిరి నర్సయ్య, కొయ్యడ ఎల్లవ్వ నాంపెల్లి, మాసిరెడ్డి అవినాష్‌రెడ్డి, కాయితీ బాలయ్య, నీరటి లక్ష్మి, అత్మకూరి రంగయ్య, గొడిశెల నీరజ ఎల్లయ్య, సావనపెల్లి పర్శయ్య, ఈసరి ఉమరాజ్‌, సరిదేన ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:15:58+05:30 IST