ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేదెప్పుడు..?
ABN , First Publish Date - 2021-01-13T05:09:31+05:30 IST
మండల, డివిజన్, జిల్లా స్థాయిలో భూవివాదాల పరిష్కారం కోసం గతంలో రెవెన్యూ కోర్టులు ఉం డేవి.

- రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం
- ఏర్పాటుకు నోచుకోని జిల్లాకో ట్రిబ్యునల్
- భూవివాదాలు పరిష్కారం కాక ఇబ్బందులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మండల, డివిజన్, జిల్లా స్థాయిలో భూవివాదాల పరిష్కారం కోసం గతంలో రెవెన్యూ కోర్టులు ఉం డేవి. ప్రభుత్వం వాటిని రద్దు చేసి జిల్లాకొక ట్రిబ్యు నల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నాలుగు నెలలు కావస్తున్నా కూడా ఏర్పాటు చేయకపోవ డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. పెద్దపల్లి జిల్లాలో మండల తహసీల్దార్ల పరిధి లో 46 కేసులు, రెవెన్యూ అధికారుల పరిధిలో 205, జాయింట్ కలెక్టర్ కోర్టులో 42 కేసులు పెండింగు లో ఉన్నాయి. హైకోర్టులో 45 కేసులు నడుస్తు న్నాయి. హైకోర్టు కేసులు కాకుండా అధికారుల ప రిధిలో 293 కేసులు ఉన్నాయి. నాలుగు మాసాల నుంచి ప్రభుత్వం ట్రి బ్యునల్ ఏర్పాటు చేయని కారణంగా బాధితులు ఆందోళన చెందుతున్నారు. పాత రెవెన్యూ చట్టంలో మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వం నూతన రెవె న్యూ చట్టాన్ని తీసుకవచ్చింది. అలాగే వీఆర్ఓల వ్య వస్థను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములను రిజిస్త్రేషన్ చేసి అదేరోజు మ్యూటేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసేందుకు ప్రభుత్వం ధరణి పో ర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌ను వేర్వేరు గా తయారుచేశారు. వ్యవసాయేతర భూములను మం డల తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తు న్నారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇంకా సాంకేతిక సమస్యలు తలె త్తుతూనే ఉన్నాయి. వాటిలోగల సాంకేతిక లోపాల ను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నది.
రద్దయిన కోర్టులు..
గతంలో భూవివాదాలు తలెత్తినప్పుడు నేరుగా కోర్టుకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని వారి కోసం గత ప్రభుత్వాల హయాంలో మండల తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి, జాయింట్ కలెక్టర్ల స్థాయిలో అప్పీలు చేసుకునేందుకు కోర్టులను ఏర్పాటు చేశారు. వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. వీరి వద్ద ఇప్పటివరకు పెండింగులో ఉన్న కేసులన్నీ పరిష్కారం అయ్యే వరకు ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రక టించింది. కొత్తగా ఏర్పడే భూవివాదాల కోసం నేరు గా కోర్టులను సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది. నూతన రెవెన్యూ చట్టం సెప్టెంబరు 7వ తేదీ నుం చి అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. వ్యవసాయే తర భూముల రిజిస్ట్రేషన్లను నవంబర్ 2 నుంచి ప్రారంభించింది. రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్న కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకపోవడంతో భూ సమ స్యలు పరిష్కారం గాక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్న కేసులకు సంబంధించిన రికార్డు లను ప్రభుత్వం ఇప్పటికే సీజ్ చేయించింది. జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటయ్యాక వాటిని పరిష్క రించనున్నారు. నాలుగు నెలలు కావస్తున్నా ఆ భూ ములను బాధితులు అనుభవించలేని పరిస్థితి ఏర్ప డింది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు నోచులే కపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పం దించి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి భూవివాదాల ను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.