ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-28T06:08:34+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయం నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోందని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధిలో ముందకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

- వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

వేములవాడ టౌన్‌, అక్టోబరు 27 : తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయం నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోందని, అందులో భాగంగానే దేశంలో  ఎక్కడా లేని విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధిలో ముందకు తీసుకెళ్తోందని  ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. పట్టణంలోని సంగీత నిలయంలో  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ నవంబరు 15వ తేదీన నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ విజయ గర్జనకు ప్రతీ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.   ఇతర రాష్ట్రాలు తెలంగాణవైపు చూస్తున్నాయంటే కేవలం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమథకాలే కారణమన్నారు. రాష్ట్రంలో అనాథ పిల్లల సంక్షేమం కోసం త్వరలో మరో పథకం రాబోతోందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో పుష్కలమైన సాగునీరుందన్నారు.   రైతులు తరుచూ పంటమార్పిడి చేయాలని సూచించారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెండు మెడికల్‌ కాలేజీలు మంజూరైనట్లు చెప్పారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.    ప్రతీ గ్రామంలో అర్హులైన దళితులకు త్వరలోనే దళితబంధు అందు తుందన్నారు.  

అధికారుల్లో కొరవడిన  చిత్తశుద్ధి

వేములవాడ టౌన్‌, : వేములవాడలో అభివృద్ధి పనులపై అధికారులకు చిత్తశుద్ధి కొరవడిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని  సంగీత నిలయంలో  బుధవారం నిర్వహించిన నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  నియోజకవర్గం పరిధి రెండు జిల్లాలతో ముడిపడి ఉండడంతో అభివృద్ధిలో జాప్యం జరుగుతోందన్నారు. పలు సమస్యలపై ఆర్డీవోను అడిగిన ప్రతీసారి వారం రోజుల్లో అవుతుందని సమాధానం చెబుతున్నారన్నారు. ఈ విషయాన్ని రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లానని, క్షేత్రస్థాయిలో సమస్యను వివరించి పరిష్కారమయ్యేలా చూస్తానని అన్నారు.  మండలానికి ఒక రోజు కలెక్టర్‌తోపాటు అన్ని అన్ని శాఖల అధికారులతో కలిసి స్వయంగా సమావేశం నిర్వహిస్తానని,  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.  ఈ సమావేశంలో జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మార్కెఫెడ్‌ చైర్మన్‌ లోకా బాపురెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాఽధవిరాజు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌రెడ్డి, మండలాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T06:08:34+05:30 IST