ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2021-12-20T05:16:25+05:30 IST

మామిడిపల్లి శ్రీసీతారాముల ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు.

ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

- రూ 150 కోట్లతో ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
- జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎమ్మెల్యే రమేష్‌బాబు

కోనరావుపేట, డిసెంబరు 19: మామిడిపల్లి శ్రీసీతారాముల ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. ఆలయం పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆదివారం ఎమ్మెల్యే రమేష్‌బాబుకు, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ రాఘవరెడ్డి రాగా అర్చకులు రంగనాయకుల శ్రీనివాస్‌, కృష్ణహరి, లక్ష్మణ్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మామిడిపల్లి శ్రీసీతారాముల ఆలయ ఆవరణలో రూ. 1 కోటి 50 లక్షలతో ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, బావుసాయిపేట గ్రామంలో రూ 20 లక్షలతో నిర్మాణమైన రైతు వేదికను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రాంతం ఎల్లప్పుడు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని శ్రీ సీతారామస్వామిని వేడుకుంటున్నామన్నారు. ఆలయ ఆవరణలో పర్ణశాల నిర్మిస్తామని అన్నారు. కోనరావుపేట మండలం ఆధ్యాత్మికంగా మారబోతుందన్నారు. మల్క పేట, నాగారం గ్రామాలు శ్రీ సీతారాముల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నా గారంలో రూ. 60 లక్షలతో శ్రీ సీతారాముల స్వామి దేవస్థానం పనులు ప్రారంభ మ య్యాయన్నారు. మూలవాగులో రూ. 8 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. నిధులు మంజూరు చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సర్పంచ్‌లు కొక్కుల భారతి నర్సయ్య, కెంద గంగాధర్‌, వైస్‌ఎంపీపీ వంగపల్లి సుమలత, సింగిల్‌విండో చైర్మన్‌లు రామ్మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, బండ నర్సయ్య, సెస్‌ మాజీ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, మాజీ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మల్యాల దేవయ్య, ప్రతాపరెడ్డి, తిరుపతియాదవ్‌, ఎంపీటీసీ యాస్మిన్‌బాషా, రాములునాయక్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఏవో వెంకటరామవ్వ, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T05:16:25+05:30 IST