చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం
ABN , First Publish Date - 2021-10-29T05:52:42+05:30 IST
కనీస మద్దతు ధరతో చివరి గింజ వరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్ర భుత్వ విప్ భానుప్రసాద్‌రావు అన్నారు.
- 292 కొనుగోల కేంద్రాల్లో 4.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
- ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవాలి
- జడ్పీ సర్వసభ్య సమావేశంలో విప్ భానుప్రసాద్‌రావు
జ్యోతినగర్, అక్టోబరు 28 : కనీస మద్దతు ధరతో చివరి గింజ వరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్ర భుత్వ విప్ భానుప్రసాద్‌రావు అన్నారు. ఈ ఖరీఫ్‌లో 4.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అంచనా వే శామని, ఇందుకు జిల్లాలో 292 కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు. గురువారం ఎన్టీపీసీ ఈడీసీలోని మిలీనియం హాలులో జడ్పీచైర్మన్ పుట్ట మధు అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న భానుప్రసాద్‌రావు ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గత ఏడాదిలాగానే రైతులకు అం డగా ఉంటామని, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 2.11 లక్షల ఎకరాలలో వరిసాగు చేశారని, సుమారు 5.11 లక్షల మె ట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నా రు. సొంత అవసరాలు, ప్రైవేటు విక్రయాలను మినహాయించి 4.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపా రు. ప్రస్తుతం జిల్లాలో 52 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నా యని, మరో 11 లక్షల బ్యాగులు రైస్ మిల్లర్ల వద్ద ఉన్నాయని, 15 లక్షల గన్నీ బ్యాగులు జ్యూట్ మిల్లుల నుంచి మిగిలినవి సప్లయర్స్ నుంచి సమీ కరిస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జడ్పీటీసీ, ఎంపీపీలు కోరారు. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను సత్వరమే పరి ష్కరించాలని విప్ ఆదేశించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన కోరారు.
పల్లెప్రగతి పెండింగ్ పనులు పూర్తి చేయాలి..
గ్రామాల్లో పల్లె ప్రగతి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, పల్లెలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని విప్ భానుప్రసాద్‌రావు కోరారు. హరితహారం కింద నాటే మొక్కల సంరక్షణ కు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజ లు ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని, ప్రజాప్రతినిధులు అధి కారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల న్నారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయించే దిశగా సీఎం కేసీ ఆర్ చర్యలు తీసుకుంటున్నారని, జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాల ను ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు త్వరలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, జాతీయ పర్వదినాలలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు వీలుగా త్వరలో చర్యలు తీసుకుం టామని ఆయన పేర్కొన్నారు.
పథకాలు ప్రజలకు అందేలా కార్యాచరణ
- జడ్పీ చైర్మన్ పుట్ట మధు
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభు త్వం అనేక పథకాలను అమలుచేస్తోందని, రైతుబంధు, రైతు బీమాలాం టి వినూత్నమైన పథకాలను ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తున్నామ న్నారు. ఉపాధిహామీ కింద చేపడుతున్న పనులు, గ్రామీణాభివృద్ధి, పం చాయతీరాజ్ పనులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై అధికారుల తో చర్చించారు.
వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు..
- కలెక్టర్ సంగీతసత్యనారాయణ
వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు అపోహలు పడకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చూడాలని కలెక్టర్ సంగీత సత్యనారాయణ కోరారు. కరోనాకు సంబంధించి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధు లు చొరవచూపాలని ఆమె సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదన్నారు. అనవసరంగా అపోహలు పెట్టుకొని వ్యాక్సిన్ వేసుకోవడం లో అశ్రద్ధ చేయవద్దన్నారు. కోరారు. జడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధు లు సూచించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దా నికి సంబంధించిన సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు అందజేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్, గ్రంథాల య సంస్థ చైర్మన్ రఘువీర్ సింఘ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.