అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2021-12-07T06:32:09+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్‌ అంబేద్కర్‌ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సూచించారు.

అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి
అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్‌ అంబేద్కర్‌ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సూచించారు. సోమవారం అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామి క దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రచించారన్నారు. ప్రపంచం గర్వించదగిన గొప్ప మేధావి అంబేద్కర్‌ అని, ఆయన చూపిన మార్గంలో నడిచి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్ర మంలో కలెక్టరేట్‌ ఏవో కె.వై ప్రసాద్‌, సూపరింటెండెం ట్‌లు తూము రవీందర్‌, నారాయణ, జిల్లా ఎస్సీ సంక్షే మ అధికారి నాగలైశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

-  తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీ వోస్‌ జిల్లా అధ్యక్షుడు బోంకూరి శంకర్‌ అఽధ్యక్షతన జరి గిన  అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ నరేందర్‌గౌడ్‌, సందీప్‌రెడ్డి, సురేష్‌, సత్యనారాయ ణ, సంపత్‌, శ్రీనివాస్‌, బోంకూరి రవిందర్‌, రామాను జం, రాజన్న దోమ్మటి సదయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T06:32:09+05:30 IST