జాతీయ పురస్కారాల పోటీకి పల్లెలు సై...

ABN , First Publish Date - 2021-12-26T05:18:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా నిర్వహించే జాతీయ పంచాయతీ అవార్డు-2022ను దక్కించుకోవడానికి జిల్లాలోని పలు పల్లెలు పోటీ పడుతున్నాయి.

జాతీయ పురస్కారాల పోటీకి పల్లెలు సై...

- జిల్లాలో 44 నామినేషన్లు స్వీకరణ

- ఈనెల 25తో ముగిసిన గడువు

- జాతీయ పంచాయతీ దినోత్సవం రోజున ప్రధానం

జగిత్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా నిర్వహించే జాతీయ పంచాయతీ అవార్డు-2022ను దక్కించుకోవడానికి జిల్లాలోని పలు పల్లెలు పోటీ పడుతున్నాయి. జాతీయ స్థాయిలో పోటీ లో భాగస్వామ్యం కావడానికి జిల్లాలో 44 పంచాయతీలు నామినేషన్ల ను దాఖలు చేసి రంగంలోకి దిగాయి. పల్లెలు అభివృద్ధిలో ముందుంటేనే ఏరంగంలోనైనా లక్ష్యం సాధించవచ్చన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. గ్రామాల అభివృద్ధి నిమి త్తం ప్రతీ నెల నిధులు విడుదల చేస్తున్నాయి. వీటితో అభివృద్ధి సాధిం చి, ఆదర్శంగా నిలిచే పంచాయతీలను గుర్తించి మరింత ప్రోత్సహించే లా పురస్కారాలు, నగదు అవార్డులను అందించడానికి కేంద్రప్రభుత్వం పోటీలు నిర్వహిస్తోంది. జాతీయ పంచాయతీ దివాస్‌ సందర్బంగా 2020-21 సంవత్సరంలో పంచాయతీల పనితీరు ప్రాతిపదికన 2022 జాతీయ పంచాయతీ అవార్డులు అందించనుంది. ఇందుకోసం దరఖాస్తు ల స్వీకరణను ప్రారంభించి ఈనెల 25వ తేదీతో పూర్తి చేసింది. 

అవార్డు దక్కించుకుంటే అభివృద్ధికి నిధులు...

జిల్లాలోని 18 మండలాల్లో 380 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి అభివృద్ధికి ప్రతీనెల జనాభా ఆధారంగా ప్రభుత్వం పల్లె ప్రగతి కింద నిధులు మంజూరు చేస్తోంది. దీనికి తోడు వివిధ పన్నుల రూపంలో పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అందించనున్న పురస్కారానికి ఎంపికయితే మరిన్ని నిధులు దక్కిం చుకునే అవకాశాలున్నాయి. 

జిల్లాలో అవార్డులకు 44 నామినేషన్లు....

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవ త్సరంలో పంచాయతీల పనితీరు ప్రాతిపాదికన అవార్డులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో వివిధ కేటాగిరిలకు జాతీయ అవార్డులను ద క్కించుకోవడానికి 44 నామినేషన్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేశారు. పం చాయతీలు దరఖాస్తు చేసుకునే సమయంలోనే పురస్కారాలకు కేటగిరీ ని ఎంచుకోవడం, ఆన్‌లైన్‌లో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, అభివృ ద్ధి, సంక్షేమానికి సంబంధించిన పంచాయతీ డాక్యూమెంటరీ చిత్రాలు, రికార్డులు పొందుపరచడం వంటివి చేశారు. 

వివిధ కేటాగిరీలో పురస్కారాలకు దరఖాస్తులు...

జిల్లాలో వివిధ కేటాగిరీలకు పురస్కారాలు పొందడానికి దరఖాస్తులు సమర్పించారు. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కిరణ్‌ పు రస్కారం, నానాజీ దేశముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కారం, గ్రా మ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు, పిల్లల స్నేహపూర్వక పం చాయతీ అవార్డులను జాతీయ పంచాయతీ దివాస్‌ రోజైన ఏప్రిల్‌ 24వ తేదిన ప్రదానం చేయనున్నారు. దరఖాస్తులను వివిధ స్థాయిలో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన కమిటీలు పరిశీలిస్తాయి. క్షేత్ర స్థాయిలో పరిశీ లించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి సెలక్షన్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత పంచాయతీలకు వివిధ కేటాగిరిలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది.

ఏఏ అవార్డుకు ఏఏ పంచాయతీల నామినేషన్లు...

జిల్లాలో దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కిరణ్‌ పుర స్కారానికి ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌ కొండపూర్‌, జగిత్యాల మం డలం పోరండ్ల, కథలాపూర్‌ మండలం గంబీర్‌పూర్‌, కొడిమ్యాల మండ లం హిమ్మత్‌ రావుపేట, నాచుపల్లి, కొండాపూర్‌, కోరుట్ల మండలం గు మ్లాపూర్‌, మల్యాల మండలం రామ్మన్నపేట, సర్వాపూర్‌, మేడిపల్లి మం డలం కల్వకోట, మోత్కూరావుపేట, మెట్‌పల్లి మండలం మెట్లచి ట్టాపూ ర్‌, పెగడపల్లి రాజారాంపల్లి, రాయికల్‌ మండలం భూపతిపూర్‌, సారం గపూర్‌ మండలం పెంబెట్ల, వెల్గటూరు మండలం ఎండపల్లి, శాఖాపూ ర్‌, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామ్‌సభ పురస్కార్‌కు ఇబ్రహీం పట్నం మండలంలోని వర్షకొండ, కోరుట్ల మండలం నాగులపేట, మల్యా ల మండలం తాటిపల్లి, రాయికల్‌ మండలం ఒడ్డెర కాలనీలు నామినే ష న్లను సమర్పించాయి. గ్రామ పంచాయతీ డెవలప్‌ మెంట్‌ ప్లాన్‌ అవా ర్డుకు జిల్లాలోని అబ్బాపూర్‌, డబ్బ, కేశవాపూర్‌, జోగినిపల్లి, రాంపూర్‌, వె ల్లుల్ల, కొత్తపేట, ఎండపల్లి, చైల్డ్‌ ఫెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డుకు జి ల్లాలోని బీర్‌పూర్‌ మండలం బీర్‌పూర్‌, బుగ్గారం మండలం బీరసాని, గొ ల్లపల్లి మండలం గోవిందపల్లి, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌ కొండా పూర్‌, వర్షకొండ, కథలాపూర్‌ మండలం అంబారిపేట, జగిత్యాల రూర ల్‌ మండలం గుల్లపేట, కొడిమ్యాల మండలం హిమ్మత్‌ రావుపేట, నా చుపల్లి, కోరుట్ల మండలం దర్మారం, మల్యాల మండలం రామన్నపేట, సర్వాపూర్‌, మేడిపల్లి మండలం కల్వకోట, దేశాయిపేట, విలయాతాబాద్‌, రాయికల్‌ మండలం శ్రీరాంనగర్‌ పంచాయతీలు నామినేషన్లను సమర్పించాయి. 

మండల అవార్డులకు సైతం నామినేషన్లు...

కేంద్ర ప్రభుత్వం అందించే మండల అవార్డులకు సైతం జిల్లాలోని వి విధ మండలాలు నామినేషన్లను సమర్పించాయి. జిల్లాలో 18 మండలా లకు గానూ 6 మండలాలు నామినేషన్లను సమర్పించాయి. ఇందులో ఇ బ్రహీంపట్నం, కొడిమ్యాల, మేడిపల్లి, మెట్‌పల్లి, పెగడపల్లి, రాయికల్‌ మండలాలు నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించి పోటీ పడుతున్నాయి. కాగా గతంలో జిల్లాకు చెందిన పలు పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నాయి. ప్రదానంగా జిల్లాలోని పైడిమడుగు, వెల్గ టూరు, హిమ్మత్‌రావుపేట తదితర గ్రామాలు గతంలో జాతీయ అవా ర్డులను అందుకున్న జాబితాలో ఉన్నాయి. 

ఆన్‌లైన్‌లో నామినేషన్లను స్వీకరించాము

- శివ, డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (ఈ-పంచాయత్‌), జగిత్యాల

జాతీయ జాతీయ స్థాయి అవార్డులను పొందడానికి జిల్లాలోని వివిధ పంచాయతీల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లను స్వీకరించాము. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గల సెలక్షన్‌ కమిటీలు దరఖాస్తుల పరి శీలన, క్షేత్ర స్థాయి పర్యటన జరిపి నిర్ణయం తీసుకుంటాయి. రాష్ట్ర స్థా యి పరిశీలనలో ఉత్తమంగా గుర్తింపు పొందిన పలు పంచాయతీలను జాతీయ స్థాయి పోటీలకు పంపుతారు. జాతీయ స్థాయిలో సెలక్షన్‌ అ యిన పంచాయతీలకు అవార్డులు దక్కే అవకాశాలుంటాయి.


Updated Date - 2021-12-26T05:18:56+05:30 IST