అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-03-21T06:07:15+05:30 IST

అందరి సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ అన్నారు.

అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
సమావేశంలో మాట్లడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకోండ ఆరుణ


- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 


వేములవాడ రూరల్‌ మార్చి 20: అందరి సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ అన్నారు. పూర్తిస్థాయిలో అధికారులు సమా వేశానికి హాజరు కాకపోవడంతోపై అధికారులు అగ్రహం వ్యక్తం చేశారు. వేమలవాడ రూరల్‌ సర్వసభ్య సమావేశాని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడూతూ ఆదికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంపై జడ్పీ చైర్మన్‌ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కానీ వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. ఐకెపి, సింగిల్‌ విండోల ద్వారా కోనుగోళ్ల్లను ఏర్పటు చేయాలని మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం ప్రశ్నించగా ధాన్యాన్ని అన్ని గ్రామాల్లో కొనుగోల్లు చేస్తామని అన్నారు. గురుకుల, మైనార్టీ స్కూల్స్‌ అడ్మిషన్స్‌ గురించి ప్రజాప్రతినిధులుగా తమకు తెలి యజేయడం లేదని రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం ఆస హనం వ్యక్తం చేశారు. అలాగే సభ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తాన్నాన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్‌ ఎంపీపీ వజ్రమ్మబాబు, జడ్పీటీసీ ఏశ వాణి తిరుపతి, మ్యాకల రవి, ఏంపీడీవో రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల నిరసన


వేములవాడ రూరల్‌: సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసి వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి నిధులు ఉగ్రవాదుల్లా కనబడుతున్నారా అని ఎదురుగట్ల సర్పంచ్‌ సోయినేని కరుణాకర్‌ ప్రశ్నించారు. శనివారం వేము లవాడ, రూరల్‌, అర్భన్‌ మండలాల సర్వసభ్య సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలను మూడు రోజులుగా పోలీసులు తమను ఎందుకు ఆరెస్ట్‌ చేస్తు న్నారో అర్థం కావడం లేదన్నారు. మేము అసెంబ్లీ ముట్టడి వెళ్లడం లేద టని, తమను తరుచూ పోలీసులు ఆరెస్ట్‌ చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులు అందోళనకు గురవు తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఏ పార్టీ వారైన తమ నిరసనను ప్రజా స్వామ్యబద్ధంగా వ్యక్తపరిచే హక్కు ఉందని అందుకు సర్వ సభ్య సమావేశం సరైన వేదిక కాదని జడ్పీ చైర్‌పర్సన్‌ అరు ణ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. వాకౌట్‌ చేసిన వారిలో ఎంపీటీసీలు వెంకటేశం, చెన్నాడి శ్యామల, బొడ్డు నర్సయ్య, రాజశేఖర్‌, సర్పంచ్‌లు సోయినేని కరుణాకర్‌, కవిత, కదిరి రాజు, ప్రదీప్‌లు ఉన్నారు. 

Updated Date - 2021-03-21T06:07:15+05:30 IST