పొన్న వాహనంపై వేంకటేశ్వరుడి దర్శనం

ABN , First Publish Date - 2021-10-20T06:07:13+05:30 IST

సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మహిళల కోలాటం, దాండియా ఆటల మధ్య పొన్న శావపై స్వామివారు దర్శనమిచ్చారు.

పొన్న వాహనంపై వేంకటేశ్వరుడి దర్శనం
సిరిసిల్ల పురవీధుల్లో పొన్న శావ

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, అక్టోబరు 19: సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి   బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో  భాగంగా మంగళవారం రాత్రి మహిళల కోలాటం, దాండియా ఆటల మధ్య పొన్న శావపై స్వామివారు దర్శనమిచ్చారు.   ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. శావ ముందు భక్తులు గోవిందా నామ స్మరణన చేస్తూ నృత్యం చేశారు.  మహిళలు అడుగడుగునా స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:07:13+05:30 IST