ఘనంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-06-21T06:35:18+05:30 IST

పట్టణంలోని వెల్లుల రోడ్డులో ఉన్న వేంకటేశ్వ ర స్వామి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు ఆ దివారం ఘనంగా జరిగాయి.

ఘనంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు, జడ్పీ చైర్మన్‌

మెట్‌పల్లి, జూన్‌ 20 : పట్టణంలోని వెల్లుల రోడ్డులో ఉన్న వేంకటేశ్వ ర స్వామి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు ఆ దివారం ఘనంగా జరిగాయి. బ్రహ్మోతవాల్లో భాగంగా ఆలయంలో ప్ర త్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అ ర్చకులు వేదమంత్రోత్సవల మధ్య స్వామి వారి కల్యాణం ని ర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే దంపతులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు-సరోజనమ్మలు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు. జడ్పీ చైర్మ న్‌ దావ వసంత వార్షిక ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యే క పూజలు జరిపారు. స్వామి వారి కల్యాణాన్ని తి లకించారు. అదే విధంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన త్రిశక్తి ఆలయ ప్రతిష్టాపన ప్రారంభో త్సవ పత్రికను ఆలయ కమిటీ నిర్వహకులు ఎమ్మె ల్యే విద్యాసాగర్‌రావుకు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకు లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:35:18+05:30 IST