వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-07T06:20:06+05:30 IST

ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మెట్‌పల్లి ఆర్డీవో వినోద్‌కుమార్‌ సిబ్బందికి ఆదేశించారు.

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలి
వెల్లుల్లలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో వినోద్‌కుమార్‌

- ఆర్డీవో వినోద్‌కుమార్‌

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబర్‌, 6: ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మెట్‌పల్లి ఆర్డీవో వినోద్‌కుమార్‌ సిబ్బందికి ఆదేశించారు. సోమవారం మండలంలోని వెల్లుల్ల గ్రామంలో వైద్యసిబ్బంది చేపడుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచిస్తూ ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోనివారికి టీకాపై అవగాహన కల్పించారు. అదే విధంగా మండలంలో చౌలమద్ది, జగ్గాసాగర్‌, మెట్లచిట్టాపూర్‌, ఆత్మనగర్‌, వేంపేట, చింతలపేట గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటా తిరుగుతూ  వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గడ్డం లింగారెడ్డి, బద్దం సుగుణ-రాజేశ్‌, గూడూరు రజనీ-తిరుపతి, బద్దం శేకర్‌రెడ్డి, జరుపుల శ్రీనివాస్‌, మ్యాకల అర్చన-సుదర్శన్‌, తహసీల్దార్‌ నీరటి రాజేశ్‌, ఆర్‌ఐ సంధ్యారాణి, మండల వైధ్యాధికారి నరేందర్‌, కార్యదర్శులు అశోక్‌గౌడ్‌, దివ్య, నవీన్‌, ప్రశాంత్‌, మహేశ్‌, పాలకవర్గ సభ్యులు, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:20:06+05:30 IST