280 మంది ఆర్టీసీ సిబ్బందికి టీకా

ABN , First Publish Date - 2021-05-31T05:16:55+05:30 IST

జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఆదివారం కరీంనగర్‌, హుజూరాబాద్‌ బస్‌స్టేషన్లలో మొదటి డోస్‌ టీకా ఇచ్చామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు.

280 మంది ఆర్టీసీ సిబ్బందికి టీకా
ఆర్టీసీ సిబ్బందికి టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

సుభాష్‌నగర్‌, మే 30: జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఆదివారం కరీంనగర్‌, హుజూరాబాద్‌ బస్‌స్టేషన్లలో మొదటి డోస్‌ టీకా ఇచ్చామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు. 291 మందికి కోవిషీల్డ్‌ టీకా మొదటి డోస్‌ ఇవ్వాలనినిర్దేశించగా 280 మంది టీకా తీసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఉజ్మారానా, డాక్టర్‌ నాగశేఖర్‌, హెచ్‌ఈవో జీవన్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండో డోస్‌ టీకా ఇచ్చారు. ఆదివారం 22 మంది రెండో డోస్‌ తీసుకున్నారని డీఎంహెచ్‌వో తెలిపారు. 

-157 మందికి కరోనా పాజిటివ్‌

 జిల్లాలో ఆదివారం 1,379 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 157 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలో 534 మందికి పరీక్షలు నిర్వహించగా 40 మందికి, మండలాల్లో 845 మందికి పరీక్షలు నిర్వహించగా 117 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లా కేంద్రంలో ఒకరు, హుజూరాబాద్‌లో ఒకరు, రామడుగు మండలంలో ఒకరు, మొత్తం ముగ్గురు కరోనాతో మృతి చెందారు. 

Updated Date - 2021-05-31T05:16:55+05:30 IST