అనాథ పిల్లల సంరక్షణకు హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2021-05-05T06:18:55+05:30 IST
జిల్లాలోని అనాథ పిల్లల సంరక్షణ కోసం హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ శశాంక అన్నారు.

-కలెక్టర్ కె.శశాంక
కరీంనగర్, మే4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అనాథ పిల్లల సంరక్షణ కోసం హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాలల సంరక్షణ కొరకు హెల్ప్‌లైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనాతో కానీ వేరే ఇతర కారణాల వల్ల అనాథలుగా మారిన పిల్లలు, ఆశ్రమాల్లో ఉన్న పిల్లల సంరక్షణ కొరకు హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నం.040-23733665, 1098కు ఫోన్‌చేసి సమాచారం అందిస్తే రక్షణ బాధ్యతలు మహిళా శిశు సంక్షేమశాఖ తీసుకుంటుందని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సీహెచ్ శారద, బాల రక్షక భవన్ కో-ఆర్డినేటర్ ఎం సరస్వతి, సీడీబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మీ, జేజేబీ మెంబర్ ఎస్.రజని, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సంపత్, ఐసీడీఈఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.