దళితబంధు విషయంలో టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌

ABN , First Publish Date - 2021-10-28T05:34:34+05:30 IST

దళితబంధు విషయంలో టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

దళితబంధు విషయంలో టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌
హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

- హుజూరాబాద్‌ ప్రజలరా వరి కావాలా... ఉరి కావాలా...? ఆలోచించుకోండి

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 27: దళితబంధు విషయంలో టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాష్‌ను నమ్ముకుంటే బీజేపీ పార్టీ ప్రజలను నమ్ముకుందన్నారు. అన్ని సర్వేల ఫలితాలు బీజేపీవైపే ఉన్నాయన్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి హైబత్‌ తిని ఓటుకు  20 వేలు పంచు తున్నారని, బీజేపీ దీనిని అడ్డుకోవడం లేదన్నారు. ఆ డబ్బులన్నీ ప్రజలవేనని, వాటితో కనీసం పేదలయినా బాగుపడుతారన్నారు. టీఆర్‌ఎస్‌ ఫేక్‌ లేటర్లు సృష్టిస్తూ నమస్తే తెలంగాణ బూతు పేపర్‌లో రాయిస్తున్నార న్నారు. ఆ పేపర్‌ టిష్యూ కన్నా అధ్వానమన్నారు.  హుజూరాబాద్‌ ప్రజలారా వరి కావాలా..? ఉరి కావా లా..? ఆలోచించుకోవాలన్నారు. రైతులను బెదిరిస్తే ఊరుకోమని, గల్లా పట్టుకొని అడుగుతామని, ఈ విషయంలో జైలుకు పోయేందుకు కూడా సిద్ధమ న్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ధాన్యం కొనుగోలు విష యంలో ఒప్పందం కుదిరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గత యాసంగిలో 95 లక్షల మెట్రిక్‌ టన్ను లు, వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొన్నది కేంద్రమే అన్నారు. కేసీఆర్‌ చెంప చెళ్లుమనిపించాలంటే హుజూరాబాద్‌ ప్రజలు గుణ పాఠం చెప్పాలన్నారు. దళితబంధుపై సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బరి తెగించి అబద్ధాలు చెబుతు న్నారన్నారు. హైకోర్టు స్పష్టంగా వాదనలు వినిపించిం దని, దళితబంధును ఆపింది ఎవరో దళిత సమాజం గుర్తించాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తాలిబన్ల రాజ్యం రావాలిని ఆలోచిస్తోందని, రామరాజ్యం, రైతు రాజ్యం తేవాలని బీజేపీ భావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చ లేదని, అందుకే ముఖం చెల్లక ఇక్కడికి రాలేదన్నారు. అవన్నీ విడిచిపెట్టి ఎన్నికల కమిషన్‌ వీద విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఎవరికైనా ఒకేలా ఉంటాయని, అందుకే తమ నేత అమిత్‌షా ప్రచారానికి రాలేకపోయారని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకోచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదో చెప్పాలన్నారు. ఎన్నికల సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వర్తించాలని కోరారు. హుజూరాబాద్‌ ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపి కేసీఆర్‌ అహంకారాన్ని అణిచివేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్య క్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గంగిశెట్టి ప్రభాకర్‌, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:34:34+05:30 IST