డ్యాన్స్‌ వీడియోతో వైరల్‌ అయిన నూతన దంపతులకు సన్మానం

ABN , First Publish Date - 2021-08-20T05:40:07+05:30 IST

పెళ్లి బారాత్‌లో వధువు డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది.

డ్యాన్స్‌ వీడియోతో వైరల్‌ అయిన నూతన దంపతులకు సన్మానం
నూతన దంపతులను సన్మానిస్తున్న అంబేద్కర్‌ సంఘం నాయకులు

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 19: పెళ్లి బారాత్‌లో వధువు డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. ఈనెల 14న మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌, జన్నారంనకు చెందిన సాయిశ్రీశ్రేయ వివాహం జరిగింది. వివాహ అనంతరం బారాత్‌లో సాయిశ్రీశ్రేయ తన భర్త అశోక్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్‌ పరికిపండ్ల నరహరి నూతన దంపతులను అభినందించాలని స్థానిక అంబే ద్కర్‌ సంఘం నాయకులకు సూచించారు. దంపతులను గురువారం గోదావరిఖని అంబేద్కర్‌ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొంకూ రి మధు, కొంకటి లక్ష్మణ్‌, మంథని లింగయ్య, యాసర్ల చిరంజీవి, చెన్నూరి మురళి, ఉప్పులేటి హన్మంతు, దినేష్‌, తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T05:40:07+05:30 IST