నేడు మకర సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-14T05:00:43+05:30 IST

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతిగా పాటిస్తారు.

నేడు మకర సంక్రాంతి
గోపాల్‌పూర్‌ సంక్రాంతి సంబరాలు

రంగుల లోగిళ్లు కానున్న వాకిళ్లు

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 13:  సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతిగా పాటిస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరగడమే దీని ప్రత్యేకత. మూడు రోజుల పండుగలో భాగంగా గురువారం సంబరాల సంక్రాంతికి జనం స్వాగతం పలుకనున్నారు.

నేడు ఇలా ఆచరించాలి...

ఉదయమే ఇంట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా మంగళస్నానాలు ఆచరించాలి. పిండి వంటలు, ప్రత్యేక పదార్థాలు చేసి గతించిన పితృదేవతలకు నైవేద్యంగా సమర్పించాలి. తర్పణాలు విడవాలి. సమీప ఆలయాలను సందర్శించి గోత్రనామాదులతో అర్చన చేయించుకోవాలి. బ్రాహ్మణులకు బెల్లం, నువ్వులు, గుమ్మడికాయ, దక్షిణ తాంబూలాలను దానంగా ఇవ్వాలి. ప్రతి ఇంటిని రంగవల్లులతో, మామిడితోరణాలు, పూలతో అలంకరించుకోవాలి. హరిదాసులు, గంగిరెద్దులవారు, జంగమదేవరలు, బుడుబుక్కళ్ళవాళ్ళు, భిక్షకులు వస్తే వారికి తప్పక యధాశక్తి దానధర్మాలు చేయాలి. ఉదయం, సాయంత్రం వీలును బట్టి ఇంటిల్లిపాది పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. మధ్యాహ్నం 1 గంట నుంచి గృహాల్లో గౌరీ పూజలు, నోములు, సంక్రాంతి పెళ్లి నోములు, నోముల పంపిణీ, ముత్తైదువులకు వాయినాలు ఇచ్చుకోవచ్చు.

శుభప్రదం సంక్రాంతి పర్వదినం...

గోవర్ధన రాఘవాచార్య స్వామి

సంక్రాంతి పండుగ ఎంతో శుభప్రదమైంది. ఈ రోజు తప్పని సరిగా నువ్వులు, రేగు పండ్లతో తలంటు స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించాలి. పితృతర్పణాలతో పాటు దానధర్మాలు చేయాలి.

Updated Date - 2021-01-14T05:00:43+05:30 IST