చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-29T06:03:41+05:30 IST
జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్ట ణంలోని 12వ, వార్డు ఉప్పరిపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు యువతులు ధర్మస ముద్రం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులంతా దగ్గరి బంధువులే
అనారోగ్య కారణాలే అంటున్న కుటుంబ సభ్యులు
జగిత్యాల టౌన్, అక్టోబరు 28 : జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్ట ణంలోని 12వ, వార్డు ఉప్పరిపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు యువతులు ధర్మస ముద్రం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువతులు మంచి స్నేహితులే కాకుండా సమీప బంధువులు కూడా. ముగ్గురూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడంతో ఉప్పరిపేట ప్రాంతంలోని ఆ మూడు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన ఎక్క ల్‌దేవి మల్లిక(19), ఎక్కల్ దేవి గంగజల(19), ఎక్కల్‌దేవి వందన(16) మంచి స్నేహి తురాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బుధవారం వీరు ముగ్గురూ కలిసి ఇంటి నుంచి మధ్యాహ్నం సమయంలో లేడీస్ ఎంపోరియంకు వెళుతున్నామని చెప్పి వెళ్లారు. రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో రాత్రంతా వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. గురువారం ఉదయం యువతుల కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్నాహ్నం సమయంలో జగిత్యాల పట్టణంలోని ధర్మసముద్రం చెరువులో గుర్తు తెలియని యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులకు సమాచారం అందింది. చెరువు వద్దకు వెళ్లి మృతదేహాలను పరిశీలించగా మొదట ఎక్కల్‌దేవి మల్లిక, ఎక్కల్‌దేవి గంగజలల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మరో యువతి వందన మృతదేహం ఆచూకి కోసం పోలీసులు, జాలర్లు చెరువులో వెతకగా వందన మృతదేహం కూడా లభ్యం అయింది. ముగ్గురూ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారాణాలు తెలియరావడం లేదు. మృతుల కుటుంబ సభ్యులు మాత్రం అనారోగ్య కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు కుటుంబాల్లో విషాదం...
జిల్లా కేంద్రంలోని ఉప్పరిపేటలో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మల్లికకు ఆగస్టు 20న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే మల్లిక అనారోగ్యానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఎక్కల్‌దేవి గంగజలకు ఆగస్టు 23న జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాజు అనే యువకునితో వివాహం జరిగింది. వివాహం అయిన రెండు నెలలకే గంగజల సైతం అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్ప డింది. వీరితో పాటు జగిత్యాల పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎక్కల్‌దేవి వందన తల్లి నర్సవ్వ ఆరేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటినుంచి వందన తండ్రి వద్దే ఉంటోంది. తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి వందన మనోవేదనకు గురై వారితో కలిసి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆకుటుంబానికి తీరని ఆవేదనను మిగిల్చింది. జగిత్యాల పట్టణ ఇన్స్‌ఫెక్టర్ కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యపై అంతుచిక్కని ప్రశ్నలు...?
జిల్లా కేంద్రంలోని ఉప్పరిపేటకు చెందిన ముగ్గురు యువతులు ఆత్మహత్యకు పాల్ప డడంపై అంతుచిక్కని ప్రశ్నలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు ఎందుకు ఒకే సారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనే వివిధ కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. నిర్మానుషంగా ఉన్న ప్రాంతమైన ధర్మసముద్రం చెరువులను ఎంచుకుని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడట్టు స్థానికులు పలు అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. మృతుల సెల్‌ఫోన్లు పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడుతా యని పలువురు చర్చించుకుంటున్నారు. మల్లిక అనారోగ్యంతో తల్లిగారింటికి రావడం, గంగజలకు తన కుటుంబ సభ్యులతో గొడవలు పడటంతో పాటు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొల్లపల్లి మండలానికి చెందిన ఒకరు ఈ ముగ్గురిని ట్రాప్ చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు తేలనున్నాయి
మృతుల కుటుంబాలకు పరామర్శ..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉప్పరిపేటలో ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డ ముగ్గురు యువతులు కుటుంబాలను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు పరా మర్శించి తమ ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు. ఆత్మహత్యలకు గత కారణాలను అడిగి తెలుసుకుని ఓదార్చారు. అల్లాల రమేష్ రావు, నక్క జీవన్, అల్లాల ఆనంద్ రావు తదితరులు ఉన్నారు.