తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2021-05-21T04:45:44+05:30 IST
పట్టణంలోని నకసీ వాడలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. 3 తులాల న్నర బంగారు,, 10 తులాల వెండి ఆభరణాలు రూ. 4500 నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు తెలిపారు.

కోరుట్ల, మే 19: పట్టణంలోని నకసీ వాడలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. 3 తులాల న్నర బంగారు,, 10 తులాల వెండి ఆభరణాలు రూ. 4500 నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. పట్టణాలోని నకీసీ వాడకు చెందిన యామ రాజేశం రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి తన కూతురు ఇంటికి వెళ్లాడు. గురువారం రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండి ఇంట్లో సామానులు చిందరవందరగా పడిఉన్నట్లు గమనించాడు. దీంతో బీరువాలో ఉన్న 3 తులాల నర బంగారు, 10 తులాల వెండి ఆభరాణాలులతో పాటు రూ. 4500 నగదు దోంగలించినట్లు గుర్తించాడు. విషయంను పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. సంఘటన స్థలంను పోలీసులు పరిశీలన జరిపి బాఽధితుడు రాజేశం ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.