‘ముక్కోటి వృక్షార్చణ’ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T06:17:19+05:30 IST

కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని రేపు నియోజక వర్గ ప్రజలందరు మనిషికి మూడు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

‘ముక్కోటి వృక్షార్చణ’ను విజయవంతం చేయాలి
మొక్కలు అందజేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లిటౌన్‌, జూలై 23: కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని రేపు నియోజక వర్గ ప్రజలందరు మనిషికి మూడు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మొక్కల పంపిణి పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ముక్కోటి వృక్షార్చణలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గ్రామాలకు మొక్కలు చేరుకున్నాయన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రెండున్నర లక్షల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఆయన వెంట బండారి శ్రీనివాస్‌, కమిషనర్‌ చాడల తిరుపతి మోబిన్‌, ఎద్దు కుమారస్వామి, పోచాలు తదితరులున్నారు. 

Updated Date - 2021-07-24T06:17:19+05:30 IST