లక్ష్యం ...రూ. 9.72 కోట్లు

ABN , First Publish Date - 2021-03-14T05:47:27+05:30 IST

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో పంచాయతీల్లో పన్నుల వసూళ ్లకు ప్రత్యేక కార్యాచరణతో అధికార యంత్రాంగం ముందుకువెళ్తోంది.

లక్ష్యం ...రూ. 9.72 కోట్లు
దూలూరు గ్రామ పంచాయతీ భవనం

- పంచాయతీల్లో జోరుగా పన్నుల వసూళ్లు
- ఇప్పటివరకు వసూలైంది రూ. 9.03 కోట్లు
- నెలాఖరులోపు వంద శాతం పూర్తయ్యేలా ప్రణాళిక

జగిత్యాల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో పంచాయతీల్లో పన్నుల వసూళ ్లకు ప్రత్యేక కార్యాచరణతో అధికార యంత్రాంగం ముందుకువెళ్తోంది. ఆ స్తి పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. వంద శాతం లక్ష్యం పూర్తి చే సేలా అధికారులు కార్యాచరణతో పనులు చేస్తున్నారు. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 9.72కో ట్లు ఆస్తి పన్ను వసూళ్లు చేయాలన్న లక్ష్యం ఉంది. ఈనెలాఖరులోపు మొత్తం బకాయిలను వసూళ్లు చేసి వంద శాతం లక్ష్యం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్య లు వేగవంతం చేస్తోంది. 2019-20కి సంబంధించి పూర్తి స్థాయిలో ప న్నులు వసూలు కాలేదు. కరోనా వ్యాప్తి చెందడం కారణంగా పన్ను వ సూళ్లు లక్ష్యం మేరకు జరగలేదు. ఈ సారి అలాకాకుండా వందశాతం వసూళ్లు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీల్లో ఇంటి ప న్ను, నీటి పన్ను తదితర పన్నులు వసూలు చేస్తారు. ఇంటి విలువను బట్టి పన్ను వేస్తారు. దుకాణాల సముదాయాలు, నివాస గృహాలకు వేర్వేరుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులను ప్రతీ యేటా ఏప్రిల్‌ ఒకటవ తేది నుంచి మార్చి 31వ తేది వరకు ఆర్థిక సంవత్సరం గా పరిగణించి వసూలు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి వ చ్చే ఫైనాన్స్‌ నిధులతో పాటుగా గ్రామ పంచాయతీల్లో వసూలయ్యే ప న్నులతో అభివృద్ధి పనులను గ్రామాల్లో చేపడుతుంటారు. పల్లెల్లో మం చినీటి వసతి, అంతర్గత రహదారులు, వీధిదీపాలు, మురికి కాలువల నిర్మాణాలు తదితర పనులను సంబందిత నిధులతో చేసే వీలుంటుం ది. పన్నులు సక్రమంగా వసూలు అయితేనే అభివృద్ధి పనులు జరిగే అ వకాశాలుంటాయి. దీంతో ప్రస్తుతం 2020 -21 ఆర్థిక సంవత్సరానికి గా ను వంద శాతం పన్ను వసూలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులకు దిశ నిర్ధేశం చేస్తూ లక్ష్యం పూర్తి కావడంపై దృష్టి సారి స్తున్నారు. జిల్లాలోని 380 పంచాయతీల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9.72 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాలన్న లక్ష్యం ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ. 9.03 కోట్ల పన్ను వసూలు చేశారు. మిగిలిన 69 లక్ష ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 92.87 శాతం పన్ను వసూళ్లు జరిగింది. మిగలిన పన్ను వసూలుకు ఈ నెలా ఖరు వరకు సమయం ఉండడంతో వంద శాతం పూర్తి చేయడంపై అ ధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. పల్లెల్లో బకాయిదారుల జాబితా లను తయారు చేసుకోవడం, ఇంటింటికీ వెళ్లి పన్ను చెల్లించేలా ప్రోత్స హించడం, ఒత్తిడి చేయడం వంటివి చేస్తున్నారు. ప్రధానంగా పంచా యతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పన్ను వసూళ్లు జరిగేలా ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈనెలాఖరులోపు వందశాతం లక్ష్యం సాధించడానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2021-03-14T05:47:27+05:30 IST