కార్మికులకు సొంతింటి కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం
ABN , First Publish Date - 2021-11-06T05:27:59+05:30 IST
సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి తెలిపారు.

- రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని, నవంబరు 5: సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 2ఏ ఇంక్లైన్ బొగ్గుగని జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణి లో 30ఏళ్లు పనిచేసిన కార్మికులకు ఇంటిస్థలం లేదని, వారికి యాజమాన్యమే 250చదరపు గజాల ఇంటిస్థలాన్ని కేటాయించాలన్నారు. రామగుండంలో గుంట జాగ కొనుక్కోవాలన్నా కార్మికులు కొనలేని పరిస్థితి అని, 30 ఏళ్లు సంస్థలో పని చేసి పదవీవిరమణ పొందిన తరువాత వారికి రూ.60లక్షలు కూడా రావడం లేదని, కార్మికులకు సొంతింటి కోసం 250చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని సీఐటీయూ పోరాటం చేయనున్నట్టు, కార్మికునికి ఇంటి స్థలంతో పాటు డ బుల్ బెడ్‌రూమ్ క్వార్టర్స్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌జీ-1 బ్రాంచ్ కార్యదర్శి బూరుగుల రాములు అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్‌లో మెండె శ్రీనివాస్, యాదగిరి, ఆత్మకూరి రాజయ్య పాల్గొన్నారు.