బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-11-10T05:21:41+05:30 IST

సింగరేణికి చెందిన నా లుగు బొగ్గు బ్లాక్‌ల వేలంను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఏ ఐటీయూసీ జనరల్‌సెక్రటరీ సీతారామయ్య డిమాండ్‌ చేశారు.

బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి
విలేకరులతో మాట్లాడుతున్న సీతారామయ్య

- ఏఐటీయూసీ జనరల్‌ సెక్రటరీ సీతారామయ్య

యైటింక్లయిన్‌కాలనీ, నవంబరు 9: సింగరేణికి చెందిన నా లుగు బొగ్గు బ్లాక్‌ల వేలంను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఏ ఐటీయూసీ జనరల్‌సెక్రటరీ సీతారామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలంకువ్యతిరేకంగా అన్ని సంఘాలు జరిపిన చర్చలకు టీబీజీకేఎస్‌ దూరంగా ఉన్నదని, ఇప్పటి వరకు టీబీజీకేఎస్‌ స్పందిచలేదని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేంగా గత ఏడాది సమ్మె చేస్తే, కేసీఆర్‌ సింగరేణిలో ప్రైవే టీకరణ జరగనివ్వడని చెప్పి సమ్మెను విచ్ఛినం చేసే యత్నాల కు టీబీజీకేఎస్‌ పాల్పడినట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఉద్యమి స్తే ప్రయోజనం ఉంటుందని, టీబీజీకేఎస్‌ కలసిరావాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై స్పందించిన కేటీఆర్‌, సింగరేణిలో ప్రైవేటీకరణపై ఎందుకు స్పందించడం లేదన్నారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని తెలిపారు. హెడీఎఫ్‌ఈ బ్యాంక్‌లో ఖాతా ఉన్న కార్మికులకు పరిహారం ఇచ్చేలా బ్యాంక్‌ అంగీకరి స్తే, టీబీజీకేఎస్‌ పరిహారం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల బ్యాంక్‌ల్లో ఖా తాలు ఉన్న కార్మికులందరికీ 15లక్షల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీతారామయ్య డిమాండ్‌ చేశారు. 3వేల కోట్ల లాభాలు వస్తేనే సీఎస్‌ఆర్‌ నిధుల కింద 70 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. లాభాలను చూప డంలో కార్మికులను సింగరేణి యాజమాన్యం, టీబీజీకేఎస్‌, రాష్ట్ర ప్రభు త్వం కలిసి మోసం చేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 15న జరగనున్న వేజ్‌ బోర్డు సమావేశంలో మెరుగైన ఒప్పందాల కోసం పట్టుబట్టనున్నట్టు తెలి పారు. ఈవిలేకరుల సమావేశంలో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు వైవీ రావు, రాజ్‌కుమార్‌, నాయకులు ప్రకాష్‌, రాజారత్నం, బుర్ర తిరుపతి, రాంచందర్‌, అన్నారావు, శంకర్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:21:41+05:30 IST