రైతులను చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-11-28T06:07:06+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

- తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
సిరిసిల్ల టౌన్/ఎల్లారెడ్డిపేట/వేములవాడ టౌన్ నవంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం జిల్లాలోని సిరిసిల్ల పట్టణం పెద్దూర్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బొప్పాపూర్, గొల్లపల్లి, వెంకటాపూర్, వేములవాడ పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రా లను కోదండరాం, జిల్లా నాయకులు పరిశీలించి, రైతు ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావే శం లో కోదండరాం మాట్లాడారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి నుంచి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడిపేట, గొల్లపల్లి, సిరిసిల్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించామన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లర్ల వద్దకు వెళ్తే కోతలు పెడుతున్నారని, ధాన్యం తో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపుల పడాల్సి వస్తోందన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లర్ వరకు రైతులనే బాధ్యులు చేయడం వల్ల రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. యాసంగి సాగుపై ఏమైనా ముచ్చట చెపుతాడని రైతులు ఆశతో ఎదురు చూస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చి ఫామ్‌హౌజ్‌లో కూర్చున్నాడన్నారు. రైస్ మిల్లర్లను అడ్డపెట్టుకొని దోపిడీ చేయడం, రైతు కష్టార్జితాన్ని కాజేసే వ్యవస్థపై పోరాటం కొనసాగిస్తా మన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల పోరాట విజయమన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తూనే పంటల మద్దతు ధర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వానాకాలం ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగి పంటపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొనడంతో పాటు యాసంగి పంటను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సరైన సౌకర్యాల కల్పించలేదన్నారు. మార్కెట్లో రైతులను బలహీనంగా, పురుగుల కంటే హీనంగా చూస్తోంద న్నారు. అందరికీ న్యాయం అందించ గలిగే పాలన ఉండాలి కానీ మిల్లర్లను అడ్డపెట్టుకొని దోపిడీ చేసి రైతు కష్టార్జితాన్ని కాజేసే వ్యవస్థ రావడానికి వీలులే దన్నారు. తెలంగాణ కోసం ఎట్లా పోరాడామో ఆదే రీతిలో ఈ వ్యవస్థ మారడానికి కూడా కొట్లాడతామ న్నారు. కొనుగోళ్లను వేగవంతం చేసి మద్దతు ధరను అందించాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని కోదండరాం హెచ్చరించారు.
ఆయన వెంట టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనుకయ్య, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్, కోరుట్ల నియోజకవ ర్గ ఇన్చార్జీ కంతి మోహన్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, శంకర్, సుదర్శన్, తుల్జారెడ్డి, మల్లేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.