కరీంనగర్‌ను శుభ్రం చేసే బాధ్యత సిబ్బందిదే
ABN , First Publish Date - 2021-01-21T05:20:14+05:30 IST
పారిశుధ్య పనులను సక్రమంగా చేపట్టి నగరాన్ని క్లీన్‌సిటీగా ఉంచే బాధ్యత పారిశుధ్య సిబ్బందిపై ఉందని మేయర్‌యాదగిరి సునీల్‌రావు అన్నారు.

మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్ టౌన్, జనవరి 20: పారిశుధ్య పనులను సక్రమంగా చేపట్టి నగరాన్ని క్లీన్‌సిటీగా ఉంచే బాధ్యత పారిశుధ్య సిబ్బందిపై ఉందని మేయర్‌యాదగిరి సునీల్‌రావు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో కరీంనగర్ నగరపాలక సంస్థ పేరును కాపాడే విధంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, కార్మికులు పనిచేయాలని సూచించారు. ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ క్రాంతి మాట్లాడుతూ నగరపాలక సంస్థ నియంత్రణలోనే సెప్టిక్ ట్యాంకు ఆపరేటర్లు పనిచేయాలని అన్నారు. సెప్టిక్‌ట్యాంకు క్లీనింగ్ కోసం హెల్ప్‌లైన్ నంబర్ 14420ను కేటాయించామని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే ట్రేడ్‌లైసెన్సు పన్నులవసూళ్లకు ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు.
ఫనగరంలోని 14వడివిజన్ టెలిఫోన్ క్వార్టర్స్ సమీపంలో 21లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ దిండిగాల మహేశ్‌తో కలిసి మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు.