లాఠీ వినియోగ నైపుణ్యతను పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-02-05T05:56:28+05:30 IST

లాఠీల వినియోగంలో అన్నిస్థాయి లకు చెందిన పోలీసు అధికారులు నైపుణ్య తను పెంపొందించుకోవా లని సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

లాఠీ వినియోగ నైపుణ్యతను పెంచుకోవాలి
లాఠీల వినియోగంపై శిక్షణలో పోలీసు సిబ్బంది

సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 4: లాఠీల వినియోగంలో అన్నిస్థాయి లకు చెందిన పోలీసు అధికారులు నైపుణ్య తను పెంపొందించుకోవా లని సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కమిషనరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన పోలీసులకు లాఠీలవినియోగంపై నైపుణ్య తను పెంపొందించే శిక్షణ కార్యక్రమాన్ని గురువారంపరేడ్‌ గ్రౌండ్‌లో ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిర క్షణలో భాగంగా పరిస్థితులు అదుపు తప్పినట్లయితే అవసరం నిమిత్తంకోసం లాఠీలను వినియోగించాలన్నారు. బందోబస్తులకు వెళ్లిన సందర్భాలలో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు లాఠీలను, హెల్మెట్‌లను వెంట ఉంచుకోవాలన్నారు. లాఠీలు, హెల్మట్‌లను అందుబాటులో ఉంచుకోని పోలీసులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. కొన్నికొన్ని సందర్భాలలో మానవతాధృక్పతంతో వ్యవహరించా లని చెప్పారు.


 నిషేధాజ్ఞలు కొనసాగింపు..


కమిషనరేట్‌ పరిధిలో బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించడంపై, డీజే సౌండ్‌ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల 18వరకు పొడిగించామని సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్‌సెట్‌ తప్పని సరి అనిపిస్తే సంబంధిత ఏసీపీల అనుమతి పొందాలని సూచించారు. ఐపీసీ 188,హైదరాబాద్‌ నగరపోలీసుచట్టం, ఫసలీ నిబంధ నలను అనుసరించి నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


 అత్యవసర పరిస్థితుల్లో చురుకుగా స్పందించాలి..


పోలీసులు అత్యవసర పరిస్థి తుల్లో చురుకుగా స్పందిస్తేనే గుర్తింపు లభిస్తుందని సీపీ వీబీ కమలా సన్‌రెడ్డి అన్నారు. డయల్‌ 100లేదా నేరుగా వచ్చే అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమస్యల విషయంలో వేగవంతంగా స్పందించి సేవలందించా లని బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ విభాగాలకు చెందిన పోలీ సులకు ఆయన సూచించారు. కమిషనరేట్‌ కేంద్రంలో గురువారం బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ పోలీసులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా సీపీ మాట్లా డుతూ నేరాలు జరిగే ఆస్కారం ఉండే ప్రాంతాల్లో క్షుణ్ణంగాతనిఖీ, రేయింబవళ్లుపెట్రోలింగ్‌ నిర్వహించా లన్నారు. పోలీసుశాఖ మంజూరుచేసిన వాహనాలను సొంత వాహనాల తీరుగా కాపాడుకోవాలన్నారు.

Updated Date - 2021-02-05T05:56:28+05:30 IST