మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-09-03T06:20:13+05:30 IST

మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ని పేదలకు, కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని మంథని ఎ మ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కొనియాడారు.

మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ సేవలు చిరస్మరణీయం
మంథనిలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

- ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

మంథని, సెప్టెంబరు 2: మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ని పేదలకు, కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని మంథని ఎ మ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కొనియాడారు. వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ చిత్రపటానికి పూలమాల లు వేసి గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ అమలుచేసిన అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు, కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేశారు. క్యాంపు కార్యాలయం లో సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు శ్రీధర్‌బాబు చెక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్‌, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కో-అర్డినేటర్‌ శశిభూషణ్‌కాచే, కౌన్సిలర్‌ పెండ్రి రమ, వొడ్నాల శ్రీనివాస్‌, గోటికార్‌ కిషన్‌జీ, చొప్పకట్ల హన్ముంతు, ఆయేషా, జంజర్ల శేఖర్‌, అజీం, సత్యంలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T06:20:13+05:30 IST