నిబంధనలు కఠినంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-05-21T04:49:24+05:30 IST

ప్రభుత్వం ఆదేశాలతో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠి నంగా అమలు చేయాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశిం చా రు.

నిబంధనలు కఠినంగా అమలు చేయాలి
సూచనలు చేస్తున్న అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌

అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌

కొడిమ్యాల, మే 20: ప్రభుత్వం ఆదేశాలతో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠి నంగా అమలు చేయాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశిం చా రు. గురువారం జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న మండలం లోని దొంగమర్రి(జేఎన్‌టీయూ)పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ను ఆకస్మికంగా పరిశీలిం చారు. నిబంధనలు పాటిస్తూ పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. ఉద యం పది గంటలు దాటిన తర్వాత వాహనాలు రోడ్లపైకి వస్తె సీజ్‌ చేయా లని ఆదేశాలను జారీ చేశారు. అనుమతి పత్రాలు ఉండి, అత్యవసరంగా రో డ్లపైకి వచ్చే వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిబంద నలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని కొడిమ్యాల, మల్యా ల ఎస్సైలు ఎన్‌. మహేందర్‌, నాగరాజులను ఆదేశించారు. అడిషనల్‌ ఎస్పీ వెంట జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ కిషోర్‌ ఉన్నారు.

Updated Date - 2021-05-21T04:49:24+05:30 IST