తక్షణమే రేషనలైజేషన్ విధానం రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-08-25T06:10:31+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రేషనలైజేషన్ ప్రక్రియను తక్షణం నిలిపివేసి, బదిలీలు, పదోన్నతులు వెనువెంటనే చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి డిమాండ్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 24: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రేషనలైజేషన్ ప్రక్రియను తక్షణం నిలిపివేసి, బదిలీలు, పదోన్నతులు వెనువెంటనే చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్చి 2021న అసెంబ్లీ సాక్షిగా బదిలీలు చేపట్టి, పదోన్నతులు కల్పిస్తామని హామీఇచ్చి ఐదు నెలలు గడిచినా నేటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. రేషనలైజేషన్ పేరుతో జీవోనెం. 25ను తీసుకురావడం ఉపాధ్యాయ వర్గాల్లో నిరసన జ్వాలకు కారణం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తక్షణమే జీవోను రద్దు చేయాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్నం రాంరెడ్డి, ప్రధానకార్యదర్శి నరేంధర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనుగు మల్లారెడ్డి, కే రాజమౌళి, శశిధర్, మొగిలి గంగారాజం, సతీష్ బాబు, చంద్రయ్య, లింగయ్య, వెంకట రమణ ఉన్నారు. ధర్నాకు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం మద్దతు ప్రకటించారు.